Nitish Kumar: నితీష్ కుమార్ ఓ గొప్ప రాజకీయవేత్త.. పరిణామాలు ఎలా మారుతున్నాయో ఆయన పసిగట్టినంతగా మరెవరికీ సాధ్యం కాదంటారు తన మద్దతుదారులు. ఆయనకు వృద్ధాప్యం మీద పడిందని, బ్యాలెన్స్ కోల్పోతున్నారని, ఆయన ఓ పల్టూరామ్ అని, అధికారం కోసం ఎవరితోనైనా కలిసి నడుస్తారని, ప్రత్యర్థులు ఆయనపై చేసే విమర్శలు. ఈ విమర్శలు అన్నీ ఆయన పటాపంచలు చేస్తూ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గొప్ప ఫలితాలు రాబట్టారు. ఆయన ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసిన ప్రజల్లో ఏమాత్రం ఆయన ఇమేజ్ తగ్గలేదని తాజా ఫలితాలు వెల్లడించాయి. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే ఈ దఫా ఎన్నికల్లో గతంలో కంటే జేడీయూ, కూటమికి అధికంగా సీట్లు వచ్చాయి. దీంతో బిహార్‌ను సుదీర్ఘకాలం పాలించిన సీఎంగా ఆయన తన రికార్డును మరింత బలోపేతం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయన రాజకీయ జీవితాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: KTM Recalls: KTM బైక్ వాహనదారులకు అలర్ట్.. కంపెనీ ఈ మోడల్స్ డ్యూక్‌లను రీకాల్.. చెక్ చేసుకోండి
పార్లమెంట్ ఎన్నికలతో రాటుదేలిపోయి..
నితీష్ కుమార్ 1951లో పట్నా సమీపంలోని భక్తియార్‌పుర్‌లో జన్మించారు. ఆయన తండ్రి కవిరాజ్ రామ్‌లఖన్ సింగ్ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆయుర్వేద వైద్యుడు. ఆయన తల్లి పరమేశ్వరి గృహిణి. ప్రస్తుతం పట్నా ఎన్‌ఐటీలో నితీష్ కుమార్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆయనకు విద్యార్థి దశ నుంచే రాజకీయాలు అంటే ఆసక్తి. దీంతో ఆయన చదువుకునే రోజుల నుంచే విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేవారు. చదువు పూర్తి అయిన తర్వాత ఆయన కొంతకాలం రాష్ట్ర విద్యుత్ బోర్డులో ఉద్యోగం చేశారు. కానీ రాజకీయాలపై ఉన్న ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. జయప్రకాశ్ నారాయణ్ చేపట్టిన ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ప్రస్తుత ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్, దివంగత భాజపా నేత సుశీల్‌కుమార్ మోదీ వంటి నేతలతో నితీష్ కుమార్‌కు పరిచయం ఏర్పడింది.
1985లో అసెంబ్లీకి..
ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత 1977, 80, 85 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగినా.. మొట్టమొదటి సారి ఆయన 1985లో అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టారు. 1989, 1991, 1996, 1998, 1999, 2004లో విజయవంతంగా ప్రజామోదం పొందుతూ ఎంపీగా ఎన్నికయ్యారు. అస్థిర సంకీర్ణ ప్రభుత్వాలు ఉండటంతో కేవలం 15 ఏళ్ల వ్యవధిలో ఆరు ప్రత్యక్ష ఎన్నికలు ఎదుర్కొని నితీష్ కుమార్ రాజకీయాల్లో రాటుదేలారు. 1985లో నితీష్ కుమార్ చివరిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ తర్వాత నుంచి ఆయన లోక్‌సభ ఎన్నికల బరిలోకి నిలిచారు. మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి వచ్చాక కూడా ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగలేదు. శాసనమండలి మార్గాన్నే ఆయన ఎంచుకొన్నారు. అవినీతి మరకలు అంటుతాయనే భయంతో తన కుటుంబాన్ని కూడా రాజకీయాలకు దూరంగా ఉంచారు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి.. ఒక సీఎం కొడుకు పేరు తెలియని వారు ఉండరు కదా.. కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్ కొడుకు పేరు చాలామందికి తెలియదంటే నమ్మాల్సిందే.
ఎన్డీఏ సర్కారులో ఆయన రైల్వే, వ్యవసాయశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే ఇంటర్నెట్‌లో టికెట్ బుకింగ్స్, తత్కాల్, రైల్వే బుకింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి నిర్ణయాలతో చెరగని ముద్ర వేశారు. 1999లో బెంగాల్‌లో జరిగిన ఓ రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. 2000 సంవత్సరం మార్చిలో ఒకసారి వారం రోజులు బిహార్ సీఎంగా పనిచేశారు. తిరిగి కేంద్ర రాజకీయాల్లో కొనసాగారు. 2004లో కేంద్రంలో ఎన్డీఏ ఓటమి పాలవడంతో రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చారు.
నితీష్ కుమార్‌ది రాజకీయ నేతగా వినూత్న శైలి. ప్రజలను ఆకర్షించేందుకు ఆయన ప్రతి ఎన్నికల్లో ప్రత్యేకంగా ఆలోచిస్తారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆయన ప్రభుత్వం అమలు చేసిన అన్ని పథకాలు తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోడానికి ఎన్డీఏ కూటమికి కలిసొచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి అవే మరోసారి రాష్ట్రంలో నితీష్ కుమార్‌ను సీఎం గద్దెను ఎక్కించేందుకు రహదారులు పరిచాయని చెబుతున్నారు. ఆయన వ్యూహాలను అర్థం చేసుకోవడంలో ప్రతిపక్ష శిబిరం విఫలం అయ్యిందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఆయన తన రాజకీయ చతురతతో బీహార్‌కు 10వ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడానికి సిద్ధం అవుతున్నారని వెల్లడించారు.
READ ALSO: PM Modi: కాంగ్రెస్ MMC పార్టీగా మారింది..
