NTV Telugu Site icon

JDU Chief: జేడీయూ చీఫ్‌గా మళ్లీ నితీష్‌కుమార్‌!

Jdu Chief

Jdu Chief

JDU Chief: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) చీఫ్‌గా రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్‌ను తొలగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 29న ఢిల్లీలో జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం జేడీయూ చీఫ్‌గా రాజీవ్ రంజ‌న్ సింగ్ అలియాస్ ల‌ల‌న్ సింగ్ ఉన్నారు. అయితే ఆయ‌న్ను ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించేందుకు నితీష్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఊహాగానాల నేపథ్యంలో నితీష్‌ కుమార్‌ స్వయంగా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని సమాచారం.

Read Also: Aditya L1 Mission: ఆదిత్య ఎల్1 ప్రయాణంలో మరో మైలురాయి.. వచ్చే నెల 6న గమ్యస్థానానికి చేరిక

పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని నితీష్‌కు సన్నిహితులు సలహా ఇచ్చినట్లు తెలిసింది. పార్టీ అంతర్గత విభేదాలకు బ్రేక్‌ ఇవ్వాలంటే పార్టీ నాయకత్వాన్ని స్వీకరించాల్సి ఉంటుందని పార్టీలోని సన్నిహితులతో నితీష్‌ స్వయంగా చెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లలన్‌ సింగ్‌ పార్టీని నడుపుతున్న తీరు పట్ట నితీష్‌ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారు. ముఖ్యంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌లతో పెరుగుతున్న సాన్నిహిత్యంపై నితీష్ అనుమానాలు వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ముంగేర్ నుంచి పోటీ చేసేందుకు లాలన్ సింగ్ ఆసక్తిగా ఉన్నారని, ఆయన ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదళ్) టికెట్‌పై పోటీ చేయవచ్చని నివేదికలు చెబుతున్నాయి. తన జాతీయ ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఇండియా కూటమి భాగస్వాములతో బాగా సమన్వయం చేసుకోవడంలో లలన్ సింగ్ విఫలమైనందుకు నితీష్ కూడా కలత చెందినట్లు సమాచారం.