Site icon NTV Telugu

Nithya Menon: స్కూల్ టీచర్‌గా నిత్యామేనన్.. వీడియో వైరల్

Nithya Menon

Nithya Menon

Nithya Menon: టాలీవుడ్ హీరోయిన్ నిత్యామేనన్ తెలుగు రాష్ట్రంలోని ఓ గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్‌గా మారిపోయింది. కాసేపు పిల్లలకు పాఠాలు కూడా చెప్పింది. షూటింగ్ కోసం మాత్రం కాదండోయ్. నిజంగానే జరిగిందీ సంఘటన. ప్రస్తుతం నిత్య ఓ మలయాళీ చిత్రంలో నటిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్‌లో భాగంగా ఇటీవల ఆమె తెలుగు రాష్ట్రంలోని కృష్ణాపురం గ్రామంలో సందడి చేసింది. ఈ క్రమంలోనే షూట్‌ పూర్తైన తర్వాత దగ్గర్లోని గవర్న్‌మెంట్ స్కూల్‌కు వెళ్లింది. అక్కడి పిల్లలతో కాసేపు ముచ్చటించి వారికి పాఠాలు కూడా చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

Read Also: Chiranjeevi: మరో తమిళ సినిమాని రీమేక్ చేయనున్న చిరంజీవి.. ఏదో తెలుసా?

“కృష్ణాపురం గ్రామంలోని ఈ బ్యూటిఫుల్ చిన్నారులతో నా న్యూ ఇయర్‌ డే ఇలా గడిచింది. చిన్నారులు వారి బాల్యాన్ని సంతోషంగా గడుపుతారు. వాళ్లు నా చుట్టూ ఉన్నప్పుడు నేనూ ఆనందంగా ఉంటాను” అంటూ నిత్యామేనన్ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ హీరోయిన్ నటించిన ‘వండర్ ఉమెన్’ చిత్రం సోనీ లివ్‌ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం పలు సినిమాలతో ఈ అమ్మడు ఫుల్ బిజీగా ఉంది.

Exit mobile version