Nithya Menon: టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పేరుకు కేరళ కుట్టి అయినప్పటికీ ఈ బ్యూటీ డ్రెస్సింగ్ స్టైల్, మాటతీరు.. తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చాయని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లైనా ఇప్పటివరకు తను గ్లామర్ షో చేయలేదు. ‘వెల్లతూవల్, కేరళ కేఫ్ , ఏంజెల్ జాన్, అపూర్వరాగం, అన్వర్, అలా మొదలైంది, ఉరుమి, వయోలిన్, వెప్పం, ఐదోండ్ల అయిదు, మకరమంజు, ఇష్క్, తలసమయం ఓరు పెంకుట్టి, బ్యాచిలర్ పార్టీ, జబర్దస్త్ , గుండెజారి గల్లంతయ్యిందే, బెంగళూరు డేస్, రుద్రమదేవి, కాంచన 2, S/O సత్యమూర్తి, ఒక్క అమ్మాయి తప్ప, గీత గోవిందం, భీమ్లా నాయక్’ వంటి తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ వంటి మరెన్నో మంచి మంచి సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది.
Read Also: Raptee.HV T30: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200కిమీ ప్రయాణం.. 8 సంవత్సరాల వారంటీ!
ఆమె సినీ కెరీర్ తొలినాళ్ల నుంచి ఆమెకు చాలా మంది అభిమానులు ఉన్నారు. చివరగా, 2022లో జవహర్ దర్శకత్వం వహించిన ‘తిరిచిరంబళం’ చిత్రంలో ధనుష్ సరసన నటిస్తుంది. ఇందులో ఆమె పాత్ర శోభన మరింత ట్రెండింగ్‌గా మారింది. ఈ చిత్రానికి గానూ నిత్యా మీనన్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా అందుకుంది. అలాగే ఇందులోని ‘మేగం కారుకథ’ పాటకు కూడా కొరియోగ్రఫీ జాతీయ అవార్డు వచ్చింది. ఈ సందర్భంలో ధనుష్‌కి జోడీగా నిత్యా మీనన్ ఓ చిత్రంలో నటిస్తుందని అంటున్నారు. ఈ చిత్రానికి కూడా ధనుష్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ధనుష్‌తో కలిసి నిత్యా మీనన్ మరోసారి తెరపై మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఆటోలో సామూహిక అత్యాచారం
అయితే తాజాగా నిత్యా సోషల్ మీడియాలో ఓ చిత్రాన్ని పంచుకుంది. నిత్యా మీనన్, ధనుష్ టీ గ్లాసులను చేతిలో పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసుకుని.. ‘కొత్త జర్నీ స్టార్ట్ అయ్యింది ఇడ్లీ కడై’ అని క్యాప్షన్ జతచేసింది. కాగా ధనుష్, నిత్యా మీనన్ నటించబోయే చిత్రం పేరు ఇడ్లీ కొట్టు అని అర్థం అవుతుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఎంటంటే? విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఫ్యాన్స్ ఇడ్లీ కొట్టు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు.