NTV Telugu Site icon

Nithin Movie : నితిన్ ‘రాబిన్ హుడ్ ‘మూవీ క్రేజీ అప్డేట్ వచ్చేస్తుంది..ఫ్యాన్స్ రెడీనా..

Rabinhood

Rabinhood

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఖాతాలో ఈ మధ్య ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు.. ఈ మధ్య వచ్చిన సినిమాలు అన్ని పెద్దగా ఆకట్టుకోలేపోయాయి.. ప్రస్తుతం నితిన్ కథల విషయంలో జాగ్రత్తలు తీసుకొని కొత్త సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు.. తాజాగా నితిన్ నటిస్తున్న సినిమా ‘రాబిన్ హుడ్ ‘.. . ‘భీష్మ’ లాంటి హిట్ సినిమా తర్వాత వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ఈ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది..

ఇకపోతే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన టీజర్, గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఈ సినిమాలో నితిన్ ఒక దొంగ పాత్రలో నటిస్తున్నాడు.. బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర దొంగతనాలు చేసి పేదలకు పంచిపెట్టే కాన్సెప్ట్ అని అంతా భావిస్తున్నారు.. నితిన్ లుక్ కూడా సరికొత్తగా ఉంది.. తాజాగా సినిమా నుంచి రేపు ఉదయం 11:07 గంటలకి బాస్ లేడీ కి సంబంధించిన అప్డేట్ రానుంది. ఈ మూవీలో హీరోయిన్ రోల్పై నేడు క్లారిటీ రానుంది. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 20 న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్..

ఆ టైంకు పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఆ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.. అయితే ఈ సినిమా హీరోయిన్ ఎవరనే విషయంను సీక్రెట్ గా ఉంచారు. మరోవైపు రాశి ఖన్నా, సంయుక్త పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఎవరన్నది రేపు తెలియనున్నది..