NTV Telugu Site icon

Zerodha : కోవిడ్ తర్వాత మారిన స్టాక్ మార్కెట్ కథ.. రూ.50వేల కోట్ల లాభం పొందిన జెరోధా

New Project (56)

New Project (56)

Zerodha : జెరోధా వంటి కొత్త అధునాతన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రజలు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడాన్ని సులభతరం చేశాయి. దీని తరువాత దేశంలో ఇలాంటి అనేక ప్లాట్‌ఫారమ్‌లు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్ తర్వాత స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి, రాబడుల ధోరణిలో అనూహ్యమైన మార్పులు కనిపించాయి. తన ఫ్లాట్ ఫామ్ కు సంబంధించిన కథనాన్ని జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ పంచుకున్నారు.

Read Also:Pawan Kalyan: కొణిదెల పవన్‌ కల్యాణ్ అనే నేను.. ఆ క్షణం కోసం వేచి చూస్తున్న అభిమానులు!

జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ తన ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న డీమ్యాట్ ఖాతాలలో ఇప్పుడు మొత్తం 4.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో షేర్ చేశారు. అంటే జెరోధా ఇప్పుడు రూ.4.5 లక్షల కోట్ల అసెట్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం) కంపెనీగా మారింది.

Read Also:Rahul Gandhi: ప్రియాంక పోటీ చేసి ఉంటే మోదీ ఓడిపోయేవారు

50,000 కోట్ల లాభం
జెరోధా వేదికపై ఈక్విటీ ఇన్వెస్టర్లు గత నాలుగేళ్లలో రూ.50,000 కోట్ల లాభాన్ని ఆర్జించారని జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ చెప్పారు. ఇది మాత్రమే కాదు, దాని ప్లాట్‌ఫారమ్‌లో రూ. 4.5 లక్షల కోట్ల అసెట్ మేనేజ్‌మెంట్ తో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం రూ. 1,00,000 కోట్ల లాభంతో ఉన్నారని పేర్కొన్నారు. నితిన్ కామత్ చేసిన ఈ పోస్ట్ జెరోధా విజయం గురించి తెలుపుతుంది. అతను స్ట్రోక్ తర్వాత ప్రస్తుతం కోలుకుంటున్నాడని కూడా ఇది సూచిస్తుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో, నితిన్ కామత్ తన తండ్రి చనిపోయిన దగ్గర నుండి, అతను నిద్రలేమి, అలసట, డీహైడ్రేషన్, పని భారం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ‘X’ లో పంచుకున్నారు. అతని ‘మైల్డ్ స్ట్రోక్’కి ఇది ఒక కారణం కావచ్చు. దీంతో అతడు కోలుకుంటున్నాడని, పూర్తిగా కోలుకోవడానికి 3 నుంచి 6 నెలల సమయం పడుతుందన్నారు.