టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఖాతాలో ఈ మధ్య హిట్ సినిమాలు లేవని చెప్పాలి. గతంలో ఎక్స్టార్డినరీ మ్యాన్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది.. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు మరో రెండు కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.. ప్రస్తుతం నితిన్ ఆశలన్నీ రాబిన్‌హుడ్, తమ్ముడు చిత్రాలపైనే పెట్టుకున్నారు.
ఇక రాబిన్‌హుడ్ వెంకీకుడుముల దర్శకత్వంలో రూపొందుతుంది. దీంతోపాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `తమ్ముడు సినిమాను చేస్తున్నాడు.. తమ్ముడు సినిమా కథ కొత్తగా ఉండబోతుందని పోస్టర్ ను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.. ఇటీవల నితిన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఆ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..
ఇదిలా ఉండగా.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతుంది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాలో నితిన్ పై భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారట. నేటి నుంచే ఈ యాక్షన్ ఎపిసోడ్ ప్రారంభమైనట్టు తెలుస్తుంది.. ఈ ఫైట్ సీన్ సినిమాలో హైలెట్ గా అవ్వనుందని టాక్.. దాదాపు 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ ను షూట్ చేస్తున్నారు.. అంతేకాదు ఈ ఫైట్ సీన్ కోసం దాదాపు ఎనిమిది కోట్ల బడ్జెట్ ను పెట్టనున్నట్లు సమాచారం.. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఇందులో నితిన్‌కి ఇద్దరు హీరోయిన్లుంటారని సమాచారం.. త్వరలోనే ఈ సినిమా గురించి మరో అప్డేట్ రాబోతుందని సమాచారం..