Site icon NTV Telugu

Nita Ambani: కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించిన నీతా అంబానీ..

Neta Amabani

Neta Amabani

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ సోమవారం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. తన కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహానికి ఆశీస్సులు పొందేందుకు ఆలయానికి వచ్చినట్లు ఆమె తెలిపారు. రాధిక మర్చంట్‌తో అనంత్ అంబానీ వివాహం జూలై 12న జరుగనుంది. ఈ సమయంలో మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో భారత్‌తో పాటు విదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. తన కొడుకు, కాబోయే కోడలు కోసం బాబా విశ్వనాథ్ ఆశీస్సులు కోరిన తర్వాత.. నీతా అంబానీ గంగా హారతిలో పాల్గొన్నారు.

Kishan Reddy: ఖనిజ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తాం.. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారతాం

దాదాపు అరగంట పాటు నీతా అంబానీ ఆలయంలోనే ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. గుడిలో తన అనుభవాన్ని పంచుకుంది. దర్శనం తర్వాత చాలా బాగుందని చెప్పారు. హిందూ మతంలో ఏదైనా శుభ కార్యం చేసే ముందు భగవంతుని ఆశీస్సులు తీసుకుంటారు. ఈ క్రమంలో.. అనంత్, రాధికల పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రికను కాశీ విశ్వనాథ్‌ ముందుంచారు. పదేళ్ల తర్వాత ఆలయాన్ని సందర్శించే అవకాశం వచ్చిందని నీతా అంబానీ తెలిపారు. ఇక్కడి మార్పు, అభివృద్ధిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆలయ కారిడార్‌తో పాటు నమో ఘాట్‌, ఫిల్లింగ్‌ స్టేషన్లను అద్భుతంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. పెళ్లి తర్వాత మళ్లీ అనంత్, రాధికతో కలిసి ఇక్కడకు వస్తానని నీతా అంబానీ తెలిపింది. అనంత్, రాధికల వివాహం జరిగిన తర్వాత కాశీలో తప్పకుండా ఒక ఫంక్షన్ నిర్వహించాలనుకుంటున్నాను, నేను వారితో కలిసి కాశీకి వస్తాను అని ఆమె చెప్పింది.

Ananya Nagalla : సైబ‌ర్ మోస‌గాళ్ల వ‌ల‌లో టాలీవుడ్ నటి.. చిక్కనట్టే చిక్కి..

ముకేష్, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వివాహం చేసుకోనున్నారు. అనంత్ అంబానీ, రాధిక పెళ్లి వేడుక మూడు రోజుల పాటు జరగనుందని సమాచారం. మీడియా కథనాల ప్రకారం.. మొదటి రోజు జూలై 12 న వివాహం జరగనుంది. అనంతరం రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Exit mobile version