NTV Telugu Site icon

Nita Ambani: నీతా అంబానీ వాడుతున్న ఈ చెప్పుల ధర ఎంతో తెలుసా..?

Nita Ambani (2)

Nita Ambani (2)

నీతా అంబాని.. ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. సినీ స్టార్స్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఈమెకు ఉంది.. ఏ ఫంక్షన్ కు వెళ్లినా, పార్టీలకు వెళ్ళినా కూడా ఈమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది..తన ఫ్యాషన్ ఐకాన్ తో ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది.. ఈవెంట్‌తో సంబంధం లేకుండా, ప్రతిసారి కొత్తగా కనిపిస్తుంది. ఆమె ధరించే దుస్తులు, చెప్పులు, పర్సులు ఇలా అన్నీ సరికొత్తవిగా ఉండటం మాత్రమే కాదు.. చాలా ప్రత్యేకమైనవి. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.. నీతా అంబానీ లుక్‌తో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.. ఇప్పుడు ఆమె వాడే చెప్పులు ధర సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

గత ఏడాది ఓ ఈవెంట్ లో ఆమె ధరించిన బ్యాగ్ ధర ఇండియన్‌ కరెన్సీ ప్రకారం అక్షరాల రూ. 3.2 కోట్లు అని తెలిసింది. ఈ బ్రాండ్ బ్యాగ్‌లు కొనడం చాలా కష్టం. దాని ధర కారణంగా మాత్రమే కాకుండా, బ్రాండ్ ఎంపిక చేసుకున్న వ్యక్తుల కోసం మాత్రమే బ్యాగ్‌లను డిజైన్ చేస్తుంది. బ్యాగ్‌ను తయారు చేయడానికి ఆర్డర్ ఇచ్చిన తరువాత 1 సంవత్సరం పాటు వేచి ఉండాల్సి ఉంటుందట.. ఇప్పుడు డైమండ్స్ పొదిగిన చెప్పులు అందరిని ఆకర్షస్తున్నాయి..

నీతా అంబానీ వాడే వస్తువులు ఎంత ఖరీదైనవో అందరికీ తెలుసు.. ఇటీవల ఓ ఈవెంట్ కు వెళ్లిన ఆమె హ్యాండ్ బ్యాగ్ ధర వైరల్ అయ్యింది.. ఇప్పుడు ఆమె వాడే ఫోన్ కూడా వైరల్ అవుతుంది.. ఇప్పుడు ఆమె వాడుతున్న చెప్పుల ధర ట్రెండ్ అవుతుంది. ఆ చెప్పులు మామూలు చెప్పులు మామూలు చెప్పులు కాదు డైమండ్ తో తయారు చేసినవి.. ఈ చెప్పుల ధర రూ.50 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.. ఒక సినిమా చెయ్యొచ్చు అని ప్రముఖులు చెబుతున్నారు.. నీతా అంబానీ వాడే వస్తువులు చాలా స్పెషల్ గా ఉంటాయి..