NTV Telugu Site icon

Union Budget 2025: స్టార్టప్ లకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్థిక మంత్రి.. రుణాలు భారీగా పెంపు

New Project (30)

New Project (30)

Union Budget 2025: సమ్మిళిత అభివృద్ధి పెట్టుబడుల సాధన లక్ష్యంగా బడ్జెట్ ఉటుంద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్‌ మెరుగైన పనితీరు సాధించింద‌న్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త హంగులు చేపడతామన్నారు. అన్ని ప్రభుత్వ స్కూల్స్‌కు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిస్తామన్నారు. పదేళ్లలో ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపు అవుతుందన్నారు. ఐఐటీ పాట్నా విస్తరణకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఐదేళ్లలో అదనంగా 75 వేల మెడికల్‌ సీట్లు.. బీహార్‌లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ.. రూ.30 వేలతో స్ట్రీట్‌ వెంటర్స్‌కు క్రెడిట్ కార్డులు.. బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం రూపొందించినట్లు మంత్రి వివరించారు.

Read Also:Union Budget 2025: రైతులకు సహాయం, ఆరోగ్య బీమా, విద్యారంగంలో ఏఐ వినియోగం మరెన్నో.. బడ్జెట్ అప్డేట్స్

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్లు కోట్ల రుణాలు అందజేస్తామన్నారు. అలాగే 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు మంజూరు చేస్తామన్నారు. సంస్కరణలను అమలు చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు.గిగ్‌ వర్కర్లకు గుర్తింపు కార్డులు.. ఈ-శ్రమ్‌ పోర్టల్‌ కింద నమోదు చేస్తామన్నారు. పీఎం జన్‌ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పనలో భాగంగా కోటి మంది గిగ్‌ వర్కర్లకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

Read Also:Union Budget 2025: కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి భారీగా పెంపు.. రైతులపై వరాలు కురిపించిన ఆర్థిక మంత్రి

ఎగుమతుల్లో 45 శాతం వరకు ఎంఎస్‌ఎంఈల భాగస్వామ్యం ఉందన్నారు. ఎంఎస్‌ఎంఈలకు వచ్చే ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు అందజేస్తామన్నారు. 27 రంగాల్లో స్టార్టప్‌లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు రూ.5 లక్షలతో క్రెడిట్ కార్డు మంజూరు చేస్తామన్నారు. సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది 10 లక్షల వరకు క్రెడిట్ కార్డులు అందజేస్తామన్నారు. ఎంఎస్‌ఎంఈలకు రూ.10 వేల కోట్లతో ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. రూ.30 వేల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్‌ క్రెడిట్‌ కార్డులు అందజేస్తామన్నారు. కొత్త ఉడాన్‌ పథకాన్ని మరో 120రూట్లలో అమలు చేస్తామన్నారు. 10 ఏళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.