NTV Telugu Site icon

Nirmala Sitharaman: తెలంగాణను కేసీఆర్ సర్కార్ అప్పుల రాష్ట్రంగా మార్చింది..

Nirmala Sitharaman

Nirmala Sitharaman

తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం వెంగళ్ రావు నగర్ లోని ముగ్ధ బాంకెట్ హాల్ లో నిర్వహించిన మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. 2014లో ఆంధ్రా తెలంగాణ విభజన జరిగినప్పుడు తెలంగాణ వద్ద చాలా సొమ్ము ఉండేది.. అలాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కార్ అప్పుల రాష్ట్రంగా మార్చిండు.. తెలంగాణలో ప్రభుత్వానికి రెవెన్యూ తీసుకొచ్చే ప్రాంతం హైదరాబాద్.. కానీ అలాంటి తెలంగాణను రెవెన్యూ లోటుకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అని ఆమె ఆరోపించారు. కేంద్రం తీసుకువచ్చిన పాలసీ వల్లే హైదరాబాద్ ​కు అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయి.. వేల కోట్ల పెట్టుబడి పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు పనికి రాకుండా పోయింది అని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు.

Read Also: Neha sharma : బీచ్ లో సందడి చేస్తున్న బర్త్డే బ్యూటీ నేహా శర్మ..

కుటుంబ పార్టీ పాలనలోనూ.. నిధులు సద్వినియోగ పరుచుకోవడంలోనూ విఫలమైంది అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. నవంబర్ 30న జరగబోయే ఎలక్షన్స్ తెలంగాణకు చాలా ముఖ్యమైనవి.. ఈ ఎన్నికల ప్రాముఖ్యతను ప్రజలకు తెలపాలి.. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మరిచిపోయింది.. దళితుడిని సీఎం చేస్తానన్న హామీ ఎటు పోయింది?.. కోవిడ్ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా.. భవిష్యత్ లో రాష్ట్రాలపై భారం పడకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది అని ఆమె చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం లేదు.. కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించినా.. కేసీఆర్ పెట్రోల్ మీద వ్యాట్ తగ్గించకుండా, బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేశారు.. పార్టీ పేరు నుంచి తెలంగాణ అనే పదాన్ని తీసేసి.. మళ్లీ ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు అని నిర్మలా సీతారామన్ అన్నారు. కుటుంబ పాలనతో నిధులను సరిగ్గా వినియోగించలేని పార్టీ మనకు అవసరమా? అని ఆమె ప్రశ్నించారు.