NTV Telugu Site icon

Budget 2025 : గురజాడ అప్పారావు రాసిన పద్యంతో బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టిన నిర్మలా సీతారామన్

New Project (28)

New Project (28)

Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 సంవత్సరానికి సంబంధించి భారతదేశ బడ్జెట్లను ప్రవేశపెట్టి రికార్డు సాధించారు. ఈరోజు ఆమె 2025-26 సంవత్సరానికి సంబంధించి తన ఎనిమిదో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో ఆమె భారతదేశంలో అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా రికార్డు నెలకొల్పారు. బడ్జెట్ ప్రసంగాన్ని లోక్‌సభలో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన పై చర్చ జరగాలని పట్టుబట్టాయి. వివక్షాల ఆందోళన మధ్యే ఆర్థిక మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Read Also:Unni Mukundan: మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఉన్ని ముకుందన్

దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్‌ అంటూ గురజాడ అప్పారావు రాసిన కవితతో లోక్‌సభలో తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు నిర్మలా సీతారామన్. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆమె తెలిపారు. మేము చేపట్టిన సంస్కరణలు.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయని తెలిపారు. అధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటని ఆమె అన్నారు. సున్నా శాతం పేదరికమే లక్ష్యంగా బడ్జెట్ పెడుతున్నట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో బడ్జెట్ పెట్టారు. ఇన్ ఫ్రా, మధ్య తరగతి ప్రజల వికాసమే లక్ష్యంగా ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు.

Read Also:Union Budget 2025-26 LIVE UPDATES: బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నిర్మలా సీతారామన్…. లైవ్ అప్ డేట్స్..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ‘‘మన ఆర్థిక వ్యవస్థ అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే వేగంగా అభివృద్ధి చెందుతోంది. గత 10 సంవత్సరాలలో మా వృద్ధి ట్రాక్ రికార్డ్, నిర్మాణాత్మక సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాయి. ఈ కాలంలో భారతదేశం సామర్థ్యం పై విశ్వాసం పెరిగింది. అన్ని ప్రాంతాల సమతుల్య అభివృద్ధిని ప్రోత్సహించడానికి, సమ్మిళిత వృద్ధిని సాధించడానికి రాబోయే 5 సంవత్సరాలను ఒక ప్రత్యేక అవకాశంగా మేము భావిస్తున్నాము.’’ అన్నారు.