Shetty Balija Scholarships: తూర్పుగోదావరి జిల్లాలో శెట్టిబలిజ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మంత్రులు సవిత, వాసంశెట్టి సుభాష్‌లతో కలిసి శెట్టిబలిజ విద్యార్థులకు స్కాలర్ షిప్‌లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. పాలకొల్లులో తనను గెలిపించింది బీసీలు, ఎస్సీలే అని అన్నారు. కూటమి ప్రభుత్వానికి గౌడ, శెట్టి బలిజలు మద్దతు ఉంటుందని అన్నారు. బంజేయుల రుణం తీర్చుకుంటామని చెప్పారు.
READ ALSO: Bangladesh: బంగ్లాదేశ్‌లో కలకలం.. 14 మంది సైనిక అధికారుల అరెస్ట్, మేజర్ జనరల్ మిస్సింగ్..
గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీలకు ద్రోహం చేసింది మాజీ ముఖ్యమంత్రి జగన్ అని విమర్శించారు. మాజీ సీఎం జగన్‌లాగా ఆయన తండ్రి కూడా బీసీలకు అన్యాయం చేయలేదని చెప్పారు. తన సామాజిక వర్గం కాకపోయినా శెట్టిబలిజిలే తనను గెలిపిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి మంజూరు అయిన రూ.నాలుగు కోట్లలో పాలకొల్లులో శెట్టిబలిజల కోసం రూ.మూడు కోట్లతో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో బీసీలకు అత్యధిక లబ్ధి జరుగుతుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని చెప్పారు. త్వరలో బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాలను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోసం చేశారని విమర్శించారు. చట్టసభలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సభలో మంత్రులు నిమ్మల రామానాయుడు, సవిత, వాసంశెట్టి సుభాష్‌లను శెట్టిబలిజ సంఘం నాయకులు సన్మానించారు.
READ ALSO: Fake Liquor Investigation: నకిలీ మద్యం వ్యవహారంలో సిట్ ఏర్పాటు చేశాం: సీఎం చంద్రబాబు
