NTV Telugu Site icon

US Presidential Elections: అయ్యో పాపం.. సొంత రాష్ట్రంలో నిక్కీ హేలీ ఓటమి

Nikki Hely

Nikki Hely

Nikki Haley: రిపబ్లికన్‌ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్‌ ట్రంప్‌ స్పీడ్ గా దూసుకుపోతున్నాడు. తాజాగా, సొంత రాష్ట్రం సౌత్‌ కరోలినాలో జరిగిన రిపబ్లికన్‌ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ఓటమి పాలయ్యారు. ఆమెకు 39.4 శాతం ఓట్లు పడగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు 59.9 శాతం ఓట్లతో విజయం సాధించారు. అయినా వెనక్కి తగ్గేది లేదని, సూపర్‌ ట్యూస్‌ డేలో గట్టి పోటీ ఇస్తానని ఆమె పేర్కొన్నారు. వరుసగా నాలుగో విజయంతో రిపబ్లికన్‌ అభ్యర్థిత్వానికి ట్రంప్‌ విజయావకాశాలు మెరుగు పడుతున్నాయి.

Read Also: Urvashi Rautela : హాట్ టాపిక్ గా మారిన ఊర్వశీ రౌటేలా బర్త్ డే కేక్..

కాగా, అందుకు 1,215 మంది డెలిగేట్ల మద్దతు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు నిక్కీ హేలీ 17, ట్రంప్‌ 92 డెలిగేట్ల మద్దతు గెలుచుకున్నారు. ఓవైపు వరుస కోర్టు కేసులు వేధిస్తున్నా అయోవా, న్యూ హ్యాంప్‌షైర్, నెవడా రిపబ్లికన్‌ ప్రైమరీల్లో ట్రంప్‌ ఇప్పటికే విజయం సాధించారు. అయితే, ఇంతకు ముందు వివిధ రాష్ర్టాలలో జరిగిన ఎన్నికల్లో సైతం ఆమె ట్రంప్‌ కన్నా ఓట్లలో 30 శాతం వెనుకబడి ఉంది.