Site icon NTV Telugu

Spy : బుల్లితెరపై కూడా నిరాశపరిచిన నిఖిల్ స్పై మూవీ..

Whatsapp Image 2023 12 17 At 3.25.53 Pm

Whatsapp Image 2023 12 17 At 3.25.53 Pm

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ స్పై..ఈ ఏడాది జూన్ 29 న స్పై మూవీ థియేటర్లలో రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా హిట్ తరువాత నిఖిల్ నుంచి వచ్చిన మూవీ కావడంతో విడుదలకు ముందు ఈ సినిమాకు భారీగా హైప్ వచ్చింది. తీరా రిలీజ్ అయ్యాక స్పై సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.ఇదిలా ఉంటే రీసెంట్ గా బుల్లితెరపై రిలీజ్ అయిన స్పై మూవీ అక్కడ కూడా దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఈటీవీ దక్కించుకున్నది.ఇటీవలే స్పై మూవీ ఈటీవీ లో ఫస్ట్ టైమ్ టెలికాస్ట్ అయ్యింది. ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు షాకింగ్ టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది.అర్బన్ ఏరియాలో 1.64, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలో కలిపి 1.50 టీఆర్‌పీ రేటింగ్ ను స్పై మూవీ సొంతం చేసుకున్నది.

ఇటీవల కాలంలో తెలుగులో మిడ్ రేంజ్ హీరోలు నటించిన సినిమాల్లో అతి తక్కువ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న మూవీగా స్పై నిలిచింది. అంతే కాకుండా నిఖిల్ కెరీర్‌లో కూడా ఇదే లోయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ కావడం విశేషం.నిఖిల్ కార్తికేయ 2 మూవీ 7.88 , 18 పేజీస్ 5.60 టీఆర్‌పీ రేటింగ్‌ను దక్కించుకున్నాయి. ఈ బ్లాక్‌బస్టర్ సినిమాలకు ముందు నిఖిల్‌ నటించిన అర్జున్ సురవరం కూడా 3.8 టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. వాటితో పోలిస్తే స్పై మూవీకి బుల్లితెరపై షాకింగ్ రెస్పాన్స్ లభించింది.నిఖిల్ స్పై మూవీకి గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించాడు. కే రాజశేఖర్‌రెడ్డి కథను అందిస్తూ ఈ సినిమాను నిర్మించారు. పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజైన ఈ మూవీ ఫెయిల్యూర్‌గా నిలిచింది. షూటింగ్‌ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు సరిగా పూర్తికాకుండానే స్పై సినిమాను ప్రొడ్యూసర్ రిలీజ్ చేశాడని నిఖిల్ కామెంట్స్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version