టాలీవుడ్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రాల్లో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పీరియాడికల్ పాథలాజికల్ మూవీ ‘స్వయంభు’ ఒకటి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్ ఫిబ్రవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, లెజెండరీ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ విజువల్స్ అందిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా, నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా నిలవబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా స్థాయిని పెంచేందుకు చిత్ర యూనిట్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : Rowdy Janardhan : ‘రౌడీ జనార్థన్’ ఎంట్రీకి కౌంట్‌డౌన్ స్టార్ట్..
ఏంటంటే ఈ చిత్రంలోని కీలక పాత్రలను మరియు కథా నేపధ్యాన్ని తన వాయిస్ ఓవర్‌తో పరిచయం చేయాల్సిందిగా మేకర్స్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌ను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా, హిందీ వర్షన్ కోసం బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్‌ను కూడా సంప్రదిస్తున్నారట. ఈ ఇద్దరు స్టార్ల వాయిస్ తోడైతే, ‘స్వయంభు’ పాన్ ఇండియా లెవల్లో భారీ ప్రకంపనలు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌కు తన వాయిస్ ఇచ్చి నిఖిల్‌కు సాలిడ్ సపోర్ట్ అందిస్తారో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.
