Site icon NTV Telugu

Swayambhu : నిఖిల్ స్వయంభు కొత్త రిలీజ్ డేట్ ఇదే

Swayambhu

Swayambhu

కార్తీకేయ2తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు నిఖిల్. కానీ ఆ తర్వాత వేసిన రాంగ్ స్టంప్స్ వల్ల ఇమేజ్ డ్యామేజ్ చేశాయి. 18 పేజెస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా పైసల్ రాలేదు. ఇక స్పై, అప్పుడో ఎప్పుడో ఇప్పుడో భారీ డిజాస్టర్స్‌గా నిలవడంతో స్లో అండ్ స్టడీగా మూవీస్ చేస్తున్నాడు. నెక్ట్స్ పీరియాడిక్ వార్ డ్రామా స్వయంభుతో గట్టిగా కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా కోసం గెటప్స్ ఛేంజ్ చేయడమే కాదు దాదాపు రెండేళ్లు ఈ సినిమాకే కమిటయాడు.

Also Read : Anil Ravipudi : పవన్ కళ్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి కామెంట్స్

స్వయంభు 170 రోజుల భారీ షెడ్యూల్ షూట్ కంప్లీట్ చేసుకుని ఈ మధ్యే గుమ్మడికాయ కొట్టేసింది టీం. ఈ ఇయర్ ఫిబ్రవరి13న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ఎనౌన్స్ చేశారు. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్. అయితే ఈ సినిమా రిలీజ్ కావడానికి సమయం దగ్గర పడుతున్నా టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. జస్ట్ షూట్ కంప్లీటైన వీడియో తప్ప మరో అప్డేట్ లేదు. సంక్రాంతికి పోస్టర్స్ వేసినప్పటికీ.. రిలీజ్ డేట్ మాయం అయ్యింది. స్వయంభును అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్. ఫిబ్రవరిలో స్వయంభు పోస్ట్ పోన్ అవడం పక్క. అయితే నెక్ట్స్ ఏ డేట్ కు వస్తాడనే దానిపై రాకరకలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం మార్చి 23 లేదా ఏప్రిల్ 30న రిలీజ్ చేసే ఛాన్సు ఉందని సమాచారం. అటు నిఖిల్ కూడా ఈ సినిమాపై ఎంతో నమ్మకంపెట్టుకున్నాడు. స్వయంభు కోసం చాలా కస్టపడి గుర్రపు స్వారీలు, కత్తి యుద్దలు వంటివి నేర్చుకున్నాడు. మరి నిఖిల్ కు స్వయంభు మరొక పాన్ ఇండియా హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

 

Exit mobile version