Site icon NTV Telugu

Nikhil: మూసేసిన ఆలయాన్ని తెరిపించిన హీరో నిఖిల్.. పూల వర్షంతో ఘనంగా..

Nikhil

Nikhil

Nikhil Siddhartha: టాలీవుడ్ వర్ధమాన హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వైవిధ్యభరితమైన కథలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ హీరోల్లో ఆయన కూడా ఒకరు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, కిరాక్, అర్జున్ సురవరం, కార్తికేయ 2, 18 పేజీలు వంటి సూపర్ హిట్ చిత్రాలను నిఖిల్ విభిన్న కథలను ఎంచుకంటూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని అందుకున్నారు. ఈ హీరో పాన్ – ఇండియన్ లెవెల్ లో కూడా ప్రసిద్ధి చెందాడు. ముఖ్యంగా కార్తికేయ 2 చిత్రానికి గాను ఈ యంగ్ హీరో బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ‘స్వయంభూ’ అనే మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో లీడ్ రోల్ చేస్తున్నాడు.

Kamineni Srinivas: ఎన్డీఏలో ఉండి కేంద్రం సపోర్టు చేస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యం..

ఇక కేవలం సినిమాలే కాకుండా నిఖిల్ చేసిన ఓ మంచి పనికి సోషల్ మీడియాలో ఆయనపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి వివరాలు చూస్తే.. ఏపీలోని చీరాలలో కొన్ని సంవత్సరాలుగా ఓ ఆలయం మూసి ఉండగా.. ఆ ఆలయ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో దేవాలయం శిథిలావస్థకు చేరువలోకి వచ్చింది. ఇకపోతే తాజాగా ఈ ఆలయాన్ని తిరిగి తెరిపించాడు హీరో నిఖిల్‌. ఆల‌యాన్ని తెరిపించడమే కాకుండా దాని నిర్వహణ బాధ్యతలు కూడా ఆయన తీసుకున్నాడు.

PM Modi: ప్రధాని పదవికి నరేంద్రమోడీ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం..

ఈ సందర్భంగా ఆలయాన్ని పునఃప్రారంభించేందుకు వచ్చిన హీరో నిఖిల్‌ను పూలపై నడిపించి ఆహ్వానించారు. ఈ విషయాన్ని నిఖిల్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. నిఖిల్‌ని పూల పై నడిపిస్తున్న సమయంలో గ్రామంలోని ప్రతి ఒక్కరినీ చూడొచ్చు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన నిఖిల్.. మీకు సేవ చేసిన ఘనత తన కుటుంబానికి దక్కిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఆలయాన్ని పూర్తిగా పూర్తి చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతోంది. నిఖిల్ చేసిన గొప్ప పనికి అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్వయంభూలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Exit mobile version