Site icon NTV Telugu

SPY Collections: ‘స్పై’ బాలేదనుకుంటూనే బాక్సాఫీసు వద్ద ఈ కలెక్షన్లు ఏంటి సామీ!

Spy Movie Release Date

Spy Movie Release Date

SPY Collections: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం ‘స్పై’. పాన్ ఇండియా మూవీగా అనేక భాషల్లో భారీ అంచనాల నడుమ విడుదలైంది. కార్తికేయ 2తో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. సాధారణంగానే నిఖిల్ తదుపరి సినిమాపై అంచనాలు భారీగానే ఉంటాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్ రేపిన అంచనాల కారణంగా వల్లనో ఏమో తెలియదు కానీ, మొదటి ఆట నుండే నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఒక రేంజ్ స్పై థ్రిల్లర్ గా ఊహించుకొని థియేటర్ కి వెళ్తే రొటీన్ సినిమాని చూపించారని ప్రేక్షకులనుంచి విమర్శలు వచ్చాయి. టాక్ ఇంత డివైడ్ గా వచ్చినప్పటికీ బక్రీద్ కారణంగా ఓపెనింగ్స్ మాత్రం బంపర్ హిట్ గా నిలిచాయి. ఈ స్థాయి ఓపెనింగ్స్ నిఖిల్ కి ఇప్పటి వరకు రాలేదు. బాక్సీఫీస్ లెక్కల ప్రకారం ఈ సినిమా నిఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాస్ ఓపెనర్ గా నిలిచే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు. కేవలం అమెరికా నుండే ఈ చిత్రానికి లక్ష 50 వేల అమెరికన్ డాలర్స్ వచ్చాయి.

Read Also:New Shot in Cricket: క్రికెట్‌ చరిత్రలోనే సరికొత్త షాట్.. వికెట్ల వెనకాలకు వెళ్లి బంతిని బాదిన బ్యాటర్‌! ఎవరండీ ఇతడు

ఇక మనదగ్గర కూడా సినిమాకు కళ్లు చెదిరే కలెక్షన్లు వచ్చాయి. మొత్తం మీద ఈ సినిమాకి మొదటి రోజు నైజాం ప్రాంతం లో రూ.3కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉందట. మ్యాట్నీ షోస్ , నూన్ షోస్ కంటే బెటర్ గా ఉండడం శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఇక ఏపీలో నూన్ షోస్ నుండే ఈ సినిమా విశ్వరూపం చూపించేసిందని అంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఆల్ షోస్ హౌస్ ఫుల్ అట. టిక్కెట్లు దొరికే పరిస్థితే లేదు. మొత్తం మీద ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.5 కోట్ల షేర్, అలాగే ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి రూ.6 కోట్ల షేర్ ని రాబట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 17 కోట్ల రూపాయలకు జరిగింది. లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి చాలా తేలికగా బ్రేక్ ఈవెన్ అవుతుందని ఆశిస్తున్నారు మేకర్స్.

Read Also:Balayya : బాలయ్య.. మజాకా.. సుమకు ఫ్యూజులు అవుట్..

Exit mobile version