Site icon NTV Telugu

Nikhat Zareen : సత్తా చాటిన నిఖత్‌.. ఫైనల్‌లో విజయం..

Nikhat Zareen

Nikhat Zareen

బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో వేదికగా కామన్వెల్త్‌ గేమ్స్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత క్రీడాకారులు చరిత్ర సృష్టిస్తున్నారు. ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 50 కేజీల లైట్ ఫ్లైవెయిట్ విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్ బౌట్‌లో సమగ్ర విజయం సాధించి భారత్‌కు బంగారు పతకాన్ని అందించింది. గోల్డ్ కోస్ట్ 2018 నుండి రజత పతక విజేత ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కార్లీ మెక్‌నాల్‌ను నిఖత్‌ ఓడించింది. నిఖత్ బర్మింగ్‌హామ్ 2022లో తన మూడు బౌట్‌లను 5-0తో మరియు RSC (రిఫరీ స్టాప్స్ పోటీ) ద్వారా ఒకదానిని గెలుచుకుంది. అయితే ఇవాళ జరిగిన మ్యాచుల్లో భారత్‌కు ఇది నాల్గవ స్వర్ణం కావడం విశేషం.

ఇదిలా ఉంటే.. కామన్వెల్త్ క్రీడల్లో మహిళల బాక్సింగ్ ఫైనల్లో బంగారు పతకం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అభినందించారు. ఆమె గెలుపు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఆమె విజయ పరంపరను కొనసాగించాలని ఆకాంక్షించారు. నిఖత్ జరీన్ విజయం తెలంగాణతో పాటు భారతదేశానికి మరోసారి ప్రపంచ వేదికపై ప్రశంసలు తెచ్చిందని ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం కొనసాగిస్తుందని పునరుద్ఘాటించారు.

 

Exit mobile version