Niharika Konidela About Pawan Kalyan: కొణిదెల నిహారిక ఇప్పుడు సినిమాతో ఫుల్ బిజీగా కనపడుతోంది. ఈవిడ మొదట సినీ కెరియర్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి వాటి ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆపై నాగ శౌర్యతో నటించిన “ఒక మనసు” సినిమాతో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ మీదకు అడుగు పెట్టింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందన విషయం పక్కన పెడితే.. సినిమాలో మాత్రం నిహారిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసి., నాన్న కూచి అనే వెబ్ సిరీస్ చేసింది. అంతేకాదు ఈమె తమిళ్ లోనూ ఓ సినిమాలో నటించింది. ఇకపోతే ఈవిడ చివరి సారిగా సూర్యకాంతం అనే సినిమాలో కనిపించింది. వీటితోపాటు బుల్లితెరపై పలు టీవీ షోలకు, అలాగే గేమ్ షోలకు కూడా హోస్ట్ గా వ్యవహరించింది.
Miss World Training: మిస్ వరల్డ్ కి ట్రైనింగ్ ఎలా ఉంటుందో తెలుసా..?
ఇకపోతే నిహారిక తాజాగా ప్రొడ్యూస్ చేసిన చిత్రం కమిటీ కుర్రోళ్ళు. యదు వంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ఏకంగా 20 మందికి పైగా కొత్త వాళ్లను పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన టీజర్, పాటలు మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమమును నిర్వహించారు.
Deputy CM Pawan Kalyan: మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా చర్యలు.. డిప్యూటీ సీఎం వార్నింగ్
ఈ కార్యక్రమంలో నిర్మాతగా ఉన్న మాట్లాడడానికి వచ్చింది. ఇక తాను మాటలు మొదలు పెట్టేముందు అక్కడికి వచ్చిన కొందరు మెగా అభిమానులు పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్.. అంటూ నినాదాలు చేసారు. ఈ దెబ్బకి నిహారిక కొద్దిసేపు మోనంగా ఉన్న తర్వాత మాట్లాడింది. ఇందులో భాగంగా.. “నేను కూడా డిప్యూటీ సీఎం తాలూకానే ” అంటూ మాట్లాడడంతో ఆడిటోరియం హర్షద్వానాలతో హోరెత్తింది. ఇందుకు సంబంధించిన వీడియో నెత్తిన వైరల్ గా మారింది.
నేను కూడా డిప్యూటీ సీఎం తాలూకా నే : NiharikaKonidela#SiddhuJonnalagadda #CommitteeKurrollu #NiharikaKonidela #DeputyCM #Pawankalyan #NTVENT pic.twitter.com/Jg8fo4xz8y
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) July 26, 2024

