Site icon NTV Telugu

Committee Kurrollu: డబ్బుకి ఓటు అమ్ముకొనే గొర్రెలకు అంకితం..!

Committeee

Committeee

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న మొదటి చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’.. ఇటీవల ఈ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ అయ్యింది.. ఆ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది.. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది…

ఈ సినిమా ద్వారా  11 మంది హీరోలను,4 హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నారు.. అందులో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వి రావు, టీన శ్రావ్య,విషిక, షణ్ముకి నాగుమంత్రి .. ప్రత్యేక పాత్రల్లో సాయి కుమార్ ,గోపరాజు రమణ,బలగం జయరాం,శ్రీ లక్ష్మి ,కంచెరపాలెం కిషోర్ ,కిట్టయ్య ,రమణ భార్గవ్,జబర్దస్త్ సత్తిపండు తదితరులు నటిస్తున్నారు..ఇక యదు వంశీగారు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు..

తాజాగా ఎలెక్షన్స్ను టార్గెట్ చేస్తూ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్… మందుంటే చాలు మంచి అక్కర్లేదు అంటారు.. ఎవరొస్తే మాకేంటి అంటూ గొర్రెల్లా బ్రతికేస్తారు అంటూ సాగే లిరిక్స్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి.. సాంగ్ కు తగ్గట్లే మ్యూజిక్ బాగా కుదిరింది.. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఓసారి వినేసెయ్యండి .. ప్రస్తుతం ఆ పాట నెట్టింట ట్రెండ్ అవుతుంది..

Exit mobile version