Site icon NTV Telugu

కరోనా విలయం : కేరళలో నైట్‌ కర్ఫ్యూ

కరోనా మహమ్మారి మన దేశాన్ని వదిలేలా లేదు. అయితే… తాజాగా కేరళలో కరోనా కేసులు భారీ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూ విధించింది. ఈ కర్ఫ్యూ ఆగస్టు 30 వ తేదీ నుంచి రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుందని సీఎం పినరయి విజయన్‌ తాజాగా ప్రకటించారు. అధిక సానుకూలత ఉన్న ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని కేంద్రం సూచించిన రెండు రోజుల తర్వాత కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లో శనివారం 31, 265 కొత్త కరోనా కేసులు నమోదవగా.. గత 24 గంటల్లో 153 మంది మృతి చెందారు. ఇక 21468 డిశ్చార్జ్‌ కాగా.. రాష్ట్రం లో ప్రస్తుతం 204896 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

Exit mobile version