Site icon NTV Telugu

Nigerian Drug Mafia: హైదరాబాద్‌‌లో 2500 మంది నైజీరియన్‌లు.. ఏ డ్రగ్ కేసు చూసినా వీళ్లే..!

Hyd

Hyd

Hyderabad Nigerian Drug Mafia: హైదరాబాద్‌లో నైజీరియన్లు జిమ్మిక్కులు ప్లే చేస్తున్నారు. డ్రగ్స్ కేసుల్లో అరెస్టయినా తమను తమ దేశానికి పంపకుండా కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఫలితంగా వారి డిపోర్టేషన్ ప్రక్రియ పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ఇంతకీ నైజీరియన్స్ చేస్తున్న జిమ్మిక్కేంటి? పోలీసులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? అనేది తెలుసుకుందాం.. హైదరాబాద్‌‌లో దాదాపు 2500 మంది నైజీరియన్‌లు ఉన్నారు. వారిలో 750 మందికి వీసా గడువు ముగిసినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల కాలంలో కొకైన్‌, హెరాయిన్‌, MDMA పిల్స్‌, గంజాయి తదితర మత్తు పదార్థాలను తరలిస్తూ నైజీరియన్లు పట్టుబడుతున్నారు. వీరిలో ఎక్కువమంది స్టూడెంట్‌ వీసాలపై ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వారిని తిరిగి నైజీరియాకు డిపోర్ట్‌ చేస్తేనే డ్రగ్స్‌ దందాకు కొంతమేరకు చెక్‌ పెట్టవచ్చని పోలీసులు భావించారు…

READ MORE: Supreme Court: “నాన్న, నాకు రూ. కోటి ఇస్తేనే మీతో ఉంటా”.. తండ్రికి 12 ఏళ్ల కుమార్తె డిమాండ్

కానీ ఇక్కడే పోలీసులకు సరికొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. తమను హైదరాబాద్‌ నుంచి డిపోర్ట్‌ చేయకుండా ఉండేందుకు నైజీరియన్లు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. హైదరాబాద్‌లోనే ఉండేలా కొత్తగా పెళ్లిళ్ల పేరుతో డ్రామా మొదలు పెట్టారు. లోకల్‌గా ఒక అమ్మాయిని వివాహం చేసుకుని వారితో కొన్నిరోజులు గడిపి ఆ తర్వాత ఆ అమ్మాయితో వేధింపుల కేసు పెట్టించుకుని జైలుకు వెళ్తున్నారు. తిరిగి బయటకు వచ్చి కేసులు నడుస్తుండడంతో ఇక్కడే ఉంటున్నారు. వారిపై కేసులు ఉండడంతో డిపొర్టేషన్‌ ప్రక్రియ చాలా ఇబ్బందిగా మారుతోంది. ఇలా ఎనిమిది మందికి పైగా సిటీలో ఉంటున్నట్లు సమాచారం. వీరిపై 498 A సెక్షన్ కేసులు ఉండడంతో ట్రయల్‌ పూర్తయి కేసు క్లోజ్‌ అయ్యే వరకు బయటకు పంపించే పరిస్థితి లేదు. నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌.. NDPS చట్టం ఉల్లంఘించే విదేశీయులను మన దేశం బహిష్కరించవచ్చు. దేశంలోకి చట్టవిరుద్దంగా ప్రవేశించడం, వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉండి తీవ్రమైన నేరాలకు పాల్పడడం వంటివి చేస్తే బహిష్కరణ అస్ర్తాన్ని వాడవచ్చు. కానీ విదేశీయులపై హైదరాబాద్‌లో కేసులు నమోదైతే వారిని పంపించడం చాలా కష్టం. ఇదే అదునుగా నైజీరియన్లు కొత్త మార్గాల్లో కేసుల్లో ఇరికి ఇక్కడే ఉంటున్నారు. ఇలా ఇప్పటికీ కొన్ని వందల మంది నైజీరియన్సు ఇప్పుడు వరకట్న వేధింపులు, దొంగతనాలు, దోపిడీల కేసులు పెట్టుకొని ఇక్కడే ఉండిపోయి స్వేచ్ఛగా డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు. కానీ వారిని తిరిగి వారి దేశాలకు పంపించే మార్గాలు అన్వేషిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు..

Exit mobile version