Site icon NTV Telugu

100Hours Of Cooking : ఆడవాళ్లలో ఆణిముత్యానివి తల్లి.. 100గంటలు వంట చేశావా?

Hilda Baci Nigerian Chef

Hilda Baci Nigerian Chef

100Hours Of Cooking : నేటి తరం ఆడపిల్లలకు వంటగది అంటే ఏందో కూడా తెలియకుండా పోతుంది. చదువు, ఉద్యోగం వంటి వాటితో బిజీగా మారిపోయి వంటకు చాలా దూరంగా ఉంటున్నారు. సాధారణంగా గృహిణిలు ఒక కుటుంబం కోసం వంట చేస్తే మా అంటే గంట, రెండు గంటలు.. అప్పటికే వారు అలసిపోతారు. కానీ నైజీరియా కు చెందిన ఓ మహిళా చెఫ్ ఏకధాటిగా 100 గంటల పాటు నిర్విరామంగా వంట చేసింది. అన్ని గంటల పాటు వంట చేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది. అంతకుముందు రికార్డ్ 2019లో భారత చెఫ్ లతా టాండన్ ఆగకుండా 87 గంటల 45 నిమిషాలు వంట చేసి రికార్డును నెలకొల్పారు. ఆ రికార్డును ప్రస్తుతం నైజీరియా చెఫ్ హిల్దా బాసి బ్రేక్ చేశారు. దీనికోసం హిల్దా బాసి గత గురువారం వంట ప్రారంభించారు. అలా మొదలైన వంట లండన్ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7.45 ని.లకు ముగిసింది.

Read Also:NIA Raids: ఆరు రాష్ట్రాల్లోని 100 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు

లాగోస్ లోని లెక్కి ప్రాంతానికి వ్యాణిజ్య ప్రాంతంగా పేరుంది. అక్కడే హిల్దా బాసి ఈ వంట సాహసానికి దిగింది. ఇక ఈమె చేసిన వంటల్లో.. నైజీరియాకు చెందిన ప్రత్యేక వంటకాలు అయిన సూప్ లు, టమోటా రైస్ వంటి పలు డిష్ లు ఉన్నాయి. నాన్ స్టాప్ గా 12 గంటల పాటు వంట చేసి తర్వాత ఓ గంటసేపు విశ్రాంతి తీసుకునేది. ఆ గంట సమయంలో స్నానం, వైద్య పరీక్షలు.. విశ్రాంతి అన్ని పూర్తయ్యేవి. హిల్దా బాసి చేస్తున్న సాహస ప్రయత్నాన్ని చూసేందుకు వేలాదిమంది ప్రజలు లెక్కి ప్రాంతానికి తరలివచ్చారు. ఆమె వంట చేస్తున్నంతసేపు పాటలు పాడుతూ ప్రోత్సహించారు. అంతేకాదు ఆన్లైన్లో కూడా హిల్దా బాసి వంటల కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. నైజీరియా మొత్తం ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించింది. రికార్డు నెలకొల్పగానే నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారి కూడా హిల్దా బాసికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారాయన. ఇక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ మాట్లాడుతూ.. సంబంధిత ఆధారాలను పరిశీలించిన తర్వాత అధికారికంగా హిల్దా బాసి నెలకొల్పిన రికార్డును ప్రకటిస్తామని తెలిపింది.

Read Also:Bhuma Akhila priya Arrest Live:ఏవీ సుబ్బారెడ్డిపై దాడి.. భూమా అఖిలప్రియ అరెస్టు

Exit mobile version