Nidhi Agarwal : చూపు తిప్పుకోనివ్వని అందంతో వచ్చీ రాగానే కుర్రాళ్ల మనసును కొట్టేసిన నిధి అగర్వాల్ వరుస అవకాశాలు దక్కించుకుంటూ కేరీర్ ను సాఫీగా సాగిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి బ్రేక్ అందుకున్న నిధి అగర్వాల్ ప్రస్తుతం పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న హరిహరవీరమల్లు చిత్రంలో పవన్ కల్యాణ్ తో నటిస్తోంది. ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మకు తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్ పై దృష్టి పెట్టారు. తాజాగా ఉదయనిధి స్టాలిన్ కు జంటగా కలగ తలైవన్ చిత్రంలో నటించింది. మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహించిన ఈ మూవీని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించింది. చిత్రం శుక్రవారం రిలీజైంది. ఈ చిత్రంలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. గతంలో ఈ చిత్ర దర్శకుడిని మొదట కలిసినప్పుడు తనను చూడగానే ముందు మొఖం కడుక్కొ అన్నాడంటూ చెప్పింది. ఆ తర్వాత ఆయన ఫేసియల్ ఎక్స్ ప్రెషన్స్ కోసం ఫోటో షేట్ చేశారంది. ఈ చిత్రంలో మేకప్ లేకుండా నటించానని తెలిపింది.
Read Also: China Sheep Mystery : గుండ్రంగా తిరుగుతున్న గొర్రెలమంద.. సైంటిస్టులకే సవాల్
సహ నటుడు ఉదయనిధి స్టాలిన్ తో నటించడంతో ఆయన నుంచి చాలా నేర్చుకున్నానంటూ చెప్పుకొచ్చింది. స్టాలిన్ కు వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు, పని ఒత్తిడి ఉన్నా తాను షూటింగ్ లో అది కనబరిచే వారు కాదంటూ కితాబిచ్చింది. తమిళ చిత్రాల్లో నటించడం ప్రారంభించినప్పటినుంచి తమిళం నేర్చుకుంటున్నట్లు నిధి తెలిపింది. నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ సినిమాపైనే భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్టయితే నిధి జాతీయ స్థాయిలో స్టార్ డమ్ తెచ్చుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.