NTV Telugu Site icon

NIA Raids: యూపీలో చిత్రకారుడి ఇంటిపై ఎన్‌ఐఏ దాడులు.. పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నట్లు సమాచారం..!

Nia

Nia

NIA Raids: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా తహసీల్ ఆమ్లాలో ఆదివారం ఎన్‌ఐఏ దాడులు కలకలం సృష్టించాయి. ముంబైలో పనిచేస్తున్న ఓ పెయింటర్‌ ఇంటిపై ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది. పెయింటర్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక పోలీసులతో కలిసి ఎన్‌ఐఏ బృందం దాడులు చేసింది. పెయింటర్ తౌహీద్‌కు పాకిస్థాన్ యువకుడితో సంబంధాలున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసుల సహకారంతో ఎన్ఐఏ బృందం దాడులు చేసింది. దాడి సమయంలో పెయింటర్ తౌహీద్ ఇంట్లోనే ఉన్నాడు. అతడిని NIA బృందం కొన్ని గంటల పాటు విచారించింది. అనంతరం అతని నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Telugu Movie Updates: రేపు మూడు క్రేజీ ప్రాజెక్టుల నుంచి అప్డేట్స్.. డోంట్ మిస్

ఆ ప్రాంతంలో ఎన్ఐఏ దాడులు తీవ్ర కలకలం రేపాయి. దీంతో స్థానికులు ఇళ్ల తలుపులు మూసుకున్నారు. ఎన్‌ఐఏ బృందం బరేలీకి చెందిన ఆమ్లా కొత్వాలి పోలీసులను తమ వెంట తీసుకెళ్లింది. భారీ బలగంతో చిత్రకారుడు తౌహీద్ ఇంట్లోకి ప్రవేశించిన ఎన్ఐఏ బృందం.. అతడిని చాలా సేపు ప్రశ్నించింది. దాడులు చేసిన సమయంలో స్థానిక పోలీసులు సాదాసీదా దుస్తుల్లోనే ఉన్నారు. దాడికి పాల్పడిన NIA బృందం ఢిల్లీ నుంచి వచ్చారని ఆమ్లా కొత్వాలి ఇంఛార్జ్ సతీష్ కుమార్ తెలిపారు. ఇంట్లో యువకుడు ఉండటంతో అతని ఫోన్ ను స్వాధీనం చేసుకుని.. విచారించారు. అనంతరం తిరిగి వెళ్లిపోయినట్లు ఆయన పేర్కొన్నారు.