Site icon NTV Telugu

NIA Raid: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు.. సౌత్ ఇండియాలో 19 చోట్ల తనిఖీలు..

Nia

Nia

Jihadi terrorists Group: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులను మట్టికరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తుంది. ఇందులో భాగంగానే దక్షిణ భారతదేశంలోని చాలా చోట్ల ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని 19 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

Read Also: Road Accident: చైతన్యపురిలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు నండిపింది ఎమ్మార్వో కొడుకే..!

అయితే, ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న కేంద్రాల్లో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కర్ణాటకలో 11 కేంద్రాలు, జార్ఖండ్‌లో నాలుగు కేంద్రాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి మహారాష్ట్రలో మూడు చోట్ల, ఢిల్లీలో ఒక చోట ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
గత వారం మహారాష్ట్రలోని 40 కేంద్రాలపై ఎన్‌ఐఏ దాడులు చేసింది. విచారణలో 15 మందిని అరెస్టు చేశారు. వారిలో ఒకరు ఐఎస్ కు సంబంధించిన వ్యక్తిగా గుర్తించింది. గత వారం జరిపిన సోదాల్లో లెక్కల్లో చూపని డబ్బు, కొన్ని పత్రాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వారి ఇళ్లలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.

Exit mobile version