నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం లోని ఖాజా నగర్ లో ఎన్ ఐ ఏ అధికారులు సోదాలు నిర్వహించారు. తీవ్రవాదులతో సంబంధాలు ఉండడంతో పాటు వారికి సహకరిస్తున్నారనే సమాచారంతో ఇలియాజ్ అనే వ్యక్తితో పాటు అతని మిత్రుల ఇళ్లలో సోదాలు చేశారు. పలు రికార్థులు..కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. వివిధ వెబ్ సైట్ ల ద్వారా ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల తో సంబంధాలు పెట్టుకోవడం తో పాటు వారికి సహకరిస్తున్నారని ఎన్.ఐ.ఏ.అధికారులు గుర్తించారు. ఒక్కసారిగా 20 మంది అధికారులు .. సోదాలు చేయడంతో స్థానికంగా ఉన్న ముస్లింలు అధికారులను అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారమే తాము సోదాలు చేస్తున్నామని అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అధికారులు వారికి సూచించారు.
ఇలియాస్ తో పాటు ఇతర అనుమానితులు ఇళ్లలో లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. సోదాల అనంతరం బృందం చెన్నైకి వెళ్ళింది. ఇదిలా ఉంటే.. తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు ఏపీలోని నంద్యాల, గుంటూరు జిల్లాల్లో కూడా ఎన్‌ఐఏ అధికారులు తనీఖీలు చేపట్టారు. నంద్యాలలో పీఎఫ్‌ఐ కార్యకర్త యూనస్ ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేశారు. ఉగ్రవాద సంబంధ కోణంలో కొనసాగుతున్న ఎన్‌ఐఏ సోదాల్లో.. విదేశాల నుంచి నగదు బదిలీ, బ్యాంక్ ఖాతాల లావాదేవీలు గుర్తించారు.