NTV Telugu Site icon

Most Wanted criminal: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇలియాస్ కోసం ఎన్ఐఏ గాలింపు..

Pfi

Pfi

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఉంటూ నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI) సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తున్న షేక్ ఇలియాస్ అహ్మద్ ను మోస్ట్ వాంటెడ్ జాబితాలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేర్చింది. బుచ్చిరెడ్డిపాలెంలోని ఖాజా నగర్ లో టీ స్టాల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న ఇలియాస్ PFIలో చేరారు. ఆన్ లైన్ ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంస్థ సభ్యులతో అతడు మాట్లాడేవాడని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. పీఎఫ్ఐలో చేరిన తర్వాత ముంబై, లక్నో, నిజామాబాద్, హైదరాబాద్ లలో జరిగిన శిక్షణ కార్యక్రమాలకు ఇలియాస్ అహ్మద్ హాజరయ్యారు.

Read Also: Boat Sink: వలసదారులతో వెళ్తున పడవ బోల్తా.. లిబియా తీరం 60 మంది గల్లంతు..

అయితే, ముంబైలో ఎన్ఐఏ జరిపిన దాడుల్లో ఇలియాస్ కు సంబంధించిన సమాచారం వెల్లడి కావడంతో.. బుచ్చిరెడ్డిపాలెంలోని ఖాజా నగర్ లో ఉన్న ఇలియాస్ ఇంటిపై జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహించారు. అప్పటికే ఈ సంస్థలో కీలక సభ్యుడుగా ఉన్న ఇలియాస్ ఆ సమయంలో ముంబైకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇలియాస్ కోసం వచ్చినప్పుడు.. ఆయన బంధువులతో పాటు స్థానిక ప్రజలు ఎన్ఐఏ అధికారుల వాహనాలను అడ్డుకుని.. వారి ఇంట్లో సోదాలు చేయకూడదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని వారందరినీ అదుపు చేశారు. అదనపు బలగాలను రప్పించిన పోలీసులు.. వారిని అదుపు చేసి ఇలియాస్ ఇంట్లో సోదాలు చేపట్టారు.

Read Also: Janhvi Kapoor: బ్లాక్ శారీలో శ్రీదేవిని గుర్తుచేస్తున్న జాన్వీ కపూర్

ఇలియాస్ కుటుంబ సభ్యుల నుంచి కీలక సమాచారాన్ని ఎన్ఐఏ అధికారులు సేకరించారు. ఇలియాస్ ఉపయోగిస్తున్న సెల్ ఫోన్.. కంప్యూటర్ హార్డ్ డిస్క్ తో పాటు ఇస్లామిక్ సాహిత్యం.. ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇలియాస్ తప్పించుకుని తిరుగుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇలియాస్ కోసం అధికారులు గాలిస్తున్నా.. ప్రయోజనం లేకపోయింది. బంగ్లాదేశ్ కు తరచూ వెళ్లి వచ్చే ఇలియాస్ అక్కడే ఉండవచ్చని భావిస్తున్నారు. బంగ్లాదేశ్ తో పాటు పలువురు పాకిస్తానీయులతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ అధికారుల విచారణలో వెల్లడింది. ఎలాగైనా ఇలియాస్ ను అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు మోస్ట్ వాంటెడ్ జాబితాలో అతడ్ని చేర్చారు. ఆయనకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా.. 9497715294 నెంబర్ కు వాట్సాప్ ద్వారా తెలియచేయాలని వారు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని కూడా ఎన్ఐఏ అధికారులు ప్రకటించారు.