Site icon NTV Telugu

NIA Raids: శ్రీనగర్లో ఉగ్రవాద కార్యకలాపాలు.. 9 చోట్ల ఎన్‌ఐఏ సోదాలు..

Nia

Nia

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో కీలక చర్యలు తీసుకుంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని 9 ప్రాంతాల్లో సోదాలు చేస్తుంది. ఈ దాడిలో ఎన్‌ఐఏ అధికారులతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు. శ్రీనగర్‌లోని కలమ్‌దన్‌పోరాలోని ముజమ్మిల్ షఫీ ఖాన్ (25) ఇంట్లో తనిఖీలు చేస్తుంది. దీంతో పాటు శ్రీనగర్‌లోని నవాబజార్‌లో కూడా దర్యాప్తు సంస్థ దాడులు కొనసాగిస్తుంది. ఆ తర్వాత శ్రీనగర్‌లోని గోకడల్‌లోని ముస్తాక్ అహ్మద్ ఇంటిపై దర్యాప్తు సంస్థ దాడులు చేసింది.

Read Also: Thiruveer Marriage: ప్రేయసిని పెళ్లాడిన టాలీవుడ్‌ యువ హీరో.. ఫొటోస్ వైరల్!

కాగా, ఇటీవల జనవరి నెలలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (SIA) ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన ఒక పోలీసుతో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. అరెస్టైన నిందితులిద్దరూ క్రాస్ బోర్డర్ నార్కోటిక్స్ సిండికేట్‌తో సంబంధాలను కలిగి ఉన్నారని ఆరోపించారు. జమ్మూ సెలక్షన్‌ గ్రేడ్‌ కానిస్టేబుల్‌ సైఫ్‌ ఉద్దీన్‌, ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరీ మాజీ సర్పంచ్‌ ఫరూక్‌ అహ్మద్‌ జంగల్‌ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో అరెస్టయ్యారు. అయితే, అంతకుముందు జూన్ 2023లో కూడా జమ్మూకశ్మీర్‌లోని రెండు జిల్లాల్లో టెర్రర్‌కు నిధులు సమకూర్చిన కేసులో దర్యాప్తు సంస్థ సోదాలు చేసింది. ఆ తర్వాత దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో పలు చోట్ల దాడులు నిర్వహించారు. పుల్వామా జిల్లాలోని సెదర్‌గుండ్, రత్నిపోరా అనే రెండు గ్రామాల్లో ఎన్‌ఐఏ దాడులు చేసింది.

Read Also: OnePlus 11R 5G: వన్ ప్లస్ 11R 5జీ వచ్చేసింది.. సూపర్ ఫీచర్స్.. ధర?

అయితే, శ్రీనగర్‌లో జీ-20 సమావేశానికి ముందు ఉగ్రవాద సంబంధిత కేసుల్లో జమ్మూ కాశ్మీర్‌లోని ఏడు జిల్లాలు, శ్రీనగర్, పుల్వామా, అవంతిపొరా, అనంత్‌నాగ్, షోపియాన్, పూంచ్, కుప్వారాలోని 15 చోట్ల ఎన్ఐఏ రైడ్స్ నిర్వహించింది. 70కి పైగా చోట్ల ఉగ్రవాదులు, వారి సహాయకులపై దాడులు చేసిన ఎన్ఐఏ కీలక ఆధారాలను సేకరించింది.

Exit mobile version