తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి చర్యలు తీసుకోకపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలని గత ఏడాది డిసెంబర్‌లో ఇరు రాష్ట్రాల సీఎస్‌లను ఆదేశించింది ఎన్‌హెచ్‌ఆర్సీ. దీంతో ప్రభుత్వాల నుంచి స్పందన లేక పోవడంతో సీరీయస్ అయ్యింది. ఆత్యహత్యలకు సంబంధించి ఆరు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. లేకపోతే తమ ముందు హాజరు కావాలని హెచ్చరించింది ఎన్‌హెచ్‌ఆర్సీ.
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఎన్ హెచ్ఆర్సీ సీరియస్
