Lakshya Sen Meets PM Modi: పారిస్ ఒలింపిక్స్ 2024లో పక్కాగా పతకం తెస్తాడనుకున్న వారిలో బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ ఒకడు. కీలక సమయంలో ఓటమిపాలై ఇంటిముఖం పట్టాడు. కాంస్య పతక పోరులో 21-13, 16-21, 11-21తో లీ జి జియా (మలేషియా) చేతిలో ఓడాడు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. న్యూఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రోల్స్ గురించి ఏమనుకున్నావని లక్ష్యసేన్‌ను ప్రధాని అడిగారు. అవేవీ తనకు తెలియకుండా కోచ్ ప్రకాశ్ పదుకొనే సర్ ఫోన్‌ను దూరంగా ఉంచినట్లు చెప్పాడు.
Also Read: Raayan OTT: ‘రాయన్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?
‘మ్యాచ్‌లు ఉన్నప్పుడు నావద్ద ఫోన్ లేకుండా ప్రకాశ్ సర్ చూశారు. ఏకాగ్రత కోల్పోకూడదనే ఇలా చేశారు. మ్యాచ్‌లు అయిన తర్వాతనే నాకు ఫోన్ ఇస్తారు. నాకు దేశవ్యాప్తంగా భారీగా మద్దతు లభించింది. పారిస్ ఒలింపిక్స్ నాకు చాలా అనుభవాలను ఇచ్చింది. నేర్చుకోవడానికి అద్భుత అవకాశం కల్పించింది. పతకానికి చేరువగా వచ్చి కోల్పోవడం బాధించింది. తప్పకుండా వచ్చే ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తాననే నమ్మకం ఉంది’ అని ప్రధానితో లక్ష్యసేన్ చెప్పాడు.