NTV Telugu Site icon

Sachin Tendulkar: తర్వాతి తరం సూపర్‌స్టార్‌ వచ్చేశాడు.. ఇక అతడినే ఫాలో అయితే: సచిన్‌

Sachin Tendulkar

Sachin Tendulkar

Sachin Tendulkar compares Carlos Alcaraz to Roger Federer after Wimbledon 2023: 36 ఏళ్ల సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ ఆధిపత్యానికి తెరదించుతూ.. 20 ఏళ్ల కార్లోస్‌ అల్కరాస్‌ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. అద్భుత ఆటతో ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ వింబుల్డన్‌లో అల్కరాస్‌ విజేతగా నిలిచాడు. ఐదు సెట్‌ల పాటు హోరాహోరీగా సాగిన సమరంలో టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్‌కు ముచ్చెమటలు పట్టిస్తూ.. 24వ గ్రాండ్‌స్లామ్‌ గెలవాలన్న ఆశలపై నీళ్లు చల్లాడు. అద్భుత ఆటతో ఆకట్టుకున్న అల్కరాస్‌పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా అల్కరాస్‌ ఆటకు ఫిదా అయ్యారు.

టెన్నిస్‌లో తర్వాతి తరం సూపర్‌స్టార్‌ వచ్చేశాడని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. ‘నొవాక్‌ జకోవిచ్‌, కార్లోస్‌ అల్కరాస్‌ మధ్య వింబుల్డన్‌ ఫైనల్‌ అదిరిపోయింది. ఇద్దరూ చాలా గొప్పగా ఆడారు. టెన్నిస్‌లో కొత్త సూపర్‌స్టార్‌ వచ్చేశాడు. రోజర్ ఫెదరర్‌ను ఫాలో అయినట్లే.. ఇక వచ్చే 10-12 ఏళ్లు అల్కరాస్‌ను అనుసరిస్తా’అని సచిన్‌ పేర్కొన్నారు. ‘జకోవిచ్‌కు మానసిక దృఢత్వం చాలా ఉంది. శారీరక, మానసిక సమస్యలు ఉన్నా టెన్నిస్‌లో ముందుకెళ్తున్నాడు’ అని నొవాక్‌ని ప్రశంసించారు.

Also Read: Oommen Chandy Died: కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ కన్నుమూత!

క్రికెట్‌లోకి రాకముందు సచిన్ టెండూల్కర్ టెన్నిస్‌ ఆటగాడే. టెన్నిస్ అంటే చాలా ఇష్టం. క్రికెటర్ అయినా నిత్యం టెన్నిస్ మ్యాచులు చూసేవారు. స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ను సచిన్ ఆరాధించేవారు. వింబుల్డన్‌కు వచ్చి అతడిని కలిశారు కూడా. రోజర్‌కు కూడా సచిన్‌తో మంచి స్నేహం ఉంది. ఫెదరర్‌ తర్వాత ఇప్పుడు కార్లోస్‌ అల్కరాస్‌ను ఫాలో అవుతా అని సచిన్ అన్నారు. ప్రస్తుతం సచిన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.