Site icon NTV Telugu

MLCs Oath Ceremony: కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం పూర్తి

Mlc

Mlc

MLCs Oath Ceremony: తెలంగాణ రాష్ట్రంలో కొద్దీ రోజుల క్రితం జరిగిన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులు నేడు (సోమవారం) శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున మల్కా కొమురయ్య, అంజి రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నుంచి ముఖ్య నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎం. లక్ష్మణ్, రఘునందన్ రావులు హాజరయ్యారు.

Read Also: Yuzvendra Chahal: రూ.18 కోట్లకు నేను అర్హుడినే.. యూజీ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇక మరోవైపు, ఎమ్మెల్యే కోటా నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యంలు శాసన మండలికి నూతనంగా ఎన్నికయ్యారు. వీరికి కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రులు ధానికోట శ్రీధర్ బాబు, నక్కా ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించి శాసన మండలిలో సభ్యుడిగా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంతో శాసన మండలిలో రాజకీయ శక్తుల సమీకరణల్లో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version