భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్‌లో ఐదవ, చివరి మ్యాచ్ ఈరోజు జరుగుతోంది. ఈ మ్యాచ్ తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత యువ క్రికెటర్స్ కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 05 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కివీస్ కు 272 పరుగుల టార్గెట్ ఉంచింది. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా సంజు సామ్సన్, అభిషేక్ శర్మలతో ఓపెనింగ్ ప్రారంభించింది. అభిషేక్ మొదటి బంతి నుండే తన దాడిని ప్రారంభించాడు, కానీ హోమ్ గ్రౌండ్ లో సంజు సామ్సన్ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి మూడవ ఓవర్‌లో తన వికెట్‌ను కోల్పోయాడు. ఆ తర్వాత ఐదవ ఓవర్‌లో అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. అభిషేక్ 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. అయితే, రెండు ప్రారంభ వైఫల్యాల తర్వాత, ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్య ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
Also Read:VIGNAN MAHOTSAV 2026: ప్రతిభకు గుర్తింపు ఇచ్చే జాతీయ యువజనోత్సవం.. యువతకు లక్కీ ఛాన్స్
10 ఓవర్ల తర్వాత, భారత స్కోరు 100 దాటింది. ఇషాన్ కిషన్ 12వ ఓవర్‌లో కేవలం 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. ఆ తర్వాత సూర్య 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్ సూర్య వికెట్ 15వ ఓవర్‌లో పడిపోయింది. 30 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఇషాన్, సూర్య మధ్య 137 పరుగుల భాగస్వామ్యం కేవలం 57 బంతుల్లోనే జరిగింది. సూర్య తన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. కానీ ఇషాన్ అక్కడితో ఆగలేదు. అతను కేవలం 42 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 18వ ఓవర్‌లో ఇషాన్ కిషన్ వికెట్ పడిపోయింది. 43 బంతుల్లో 103 పరుగులు చేశాడు, అందులో 10 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి.
