ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఉమెన్స్ జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. భారత్ ముందు 161 పరుగుల బిగ్ టార్గెట్ పెట్టింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ (57*) పరుగులతో అజేయంగా నిలిచింది.
Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోయిస్టుల హతం..
ఓపెనర్లుగా బరిలోకి దిగిన సుజీ బేట్స్ (27), జార్జియా ప్లిమ్మర్ మంచి ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత అమిల కేర్ (13) పరుగులు చేసింది. ఆ తర్వాత క్రీజులోకి దిగిన కెప్టెన్ సోఫియా డివేన్ అర్ధ సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. బ్రూక్ హల్లీడే (16), మ్యాడీ గ్రీన్ (5) పరుగులు చేయడంతో భారీ స్కోరును సాధించింది. భారత్ బౌలర్లలో రేణుకా సింగ్ 2 వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత అరుంధతి రెడ్డి, ఆశ శోభన తలో వికెట్ తీశారు. టీమిండియా బౌలర్లు పరుగుల సునామీకి అడ్డుకట్ట వేయలేకపోయారు. చూడాలి మరీ భారత్ ఈ టార్గెట్ చేధించి మొదటి విక్టరీ నమోదు చేస్తుందా అనేది.
Read Also: Supreme Court: ప్రభుత్వంపై జర్నలిస్టులు విమర్శలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టొద్దు