NTV Telugu Site icon

New Zealand PM: వచ్చే నెలలో రాజీనామా చేస్తా.. న్యూజిలాండ్ ప్రధాని ప్రకటన

New Zealand

New Zealand

New Zealand PM: వచ్చే నెలలో తాను రాజీనామా చేయనున్నట్లు న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ గురువారం ప్రకటించారు. ఇదే తనకు సరైన సమయమని, ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికార లేబర్‌ పార్టీ సమావేశంలో అన్నారు. లేబర్‌ పార్టీ తదుపరి నాయకుడిని ఎన్నుకునేందుకు ఈ నెల 22న ఓటింగ్‌ జరుగుతుందని చెప్పారు. సాధారణ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్‌ 14న జరుగుతాయని తెలిపారు. దీంతో ఆర్డెర్న్‌ పదవీ కాలం ఫిబ్రవరి 7 తర్వాత ముగియనుంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి లేబర్‌ పార్టీ గెలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Bomb Found: రిపబ్లిక్ డే వేడుకలే లక్ష్యం.. మిలిటరీ గ్రౌండ్స్‌లో బాంబు లభ్యం

2017లో జసిండా ఆర్డెర్న్ మొదటి సారిగా ప్రధానిగా ఎన్నికయ్యారు. సంకీర్ణ పక్షాలతో కలిసి ఆమె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే మూడేండ్ల తర్వాత 2020 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆమె నేతృత్వంలో లేబర్‌ పార్టీ సాధారణ ఎన్నికల బరిలోకి దిగింది. అయితే అనుకున్నంతగా రాణించలేకపోయింది. 49 శాతం ఓట్లతో మొత్తం 120 సీట్లకు గాను 64 స్థానాల్లో లేబర్‌ పార్టీ విజయం సాధించింది. ఇటీవలి ఎన్నికలలో ఆమె పార్టీ, వ్యక్తిగత ప్రజాదరణ పడిపోయింది. ఉప ప్రధాన మంత్రి గ్రాంట్ రాబర్ట్‌సన్ తన పేరును ముందుకు తీసుకురావడం లేదని చెప్పారు. ఆమె రాజీనామా వెనుక ఎలాంటి రహస్యం లేదని ఆర్డెర్న్ అన్నారు. ఆమె రాజీనామా ఫిబ్రవరి 7 తర్వాత అమల్లోకి వస్తుందని, జనవరి 22న లేబర్ కాకస్ కొత్త నాయకుడిపై ఓటు వేయనున్నట్లు ఆర్డెర్న్ తెలిపారు.

Show comments