Stunning Catch in Super Smash 2024: న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న సూపర్ స్మాష్ టీ20 టోర్నీలో అద్భుత క్యాచ్ నమోదైంది. క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఉన్న ఈ క్యాచ్‌ను న్యూజిలాండ్ ఆటగాళ్లు నిక్ కెల్లీ, ట్రాయ్ జాన్సన్‌లు కలిసి పట్టారు. వెల్లింగ్‌టన్, సెంట్రల్ డిస్ట్రిక్స్ జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో వీళ్లిద్దరూ అద్భుత క్యాచ్‌తో అందరని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.
సెంట్రల్ డిస్ట్రిక్ట్ బ్యాటర్ విల్ యంగ్ క్రీజులో ఉండగా.. ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌ను వెల్లింగ్‌టన్ బౌలర్ మైఖేల్ స్నెడెన్ వేశాడు. రెండో బంతికి యంగ్ భారీ షాట్ ఆడగా.. బాల్ లాంగాన్‌లో గాల్లో లేచింది. బంతిని అందుకునేందుకు ట్రాయ్ జాన్సన్ చిరుతలా పరుగెత్తాడు. బౌండరీ వద్ద బంతిని అందుకున్న ట్రాయ్ బ్యాలెన్స్ తప్పడంతో.. మైదానంలో పడకముందే చాకచక్యంగా లోపలికి విసిరాడు. ఆ బంతిని వెనుకాలే పరుగెత్తుకుంటూ వచ్చిన నిక్ కెల్లీ అద్భుతంగా అందుకున్నాడు. అలా ఇద్దరూ కలిసి సూపర్ క్యాచ్ పట్టేశారు. దాంతో యంగ్ నిరాశగా పెవిలియన్ చేరాడు.
Also Read: Milind Deora: కాంగ్రెస్‌కు మిలింద్ దేవరా రాజీనామా.. నేడు శివసేనలో చేరిక!
క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఫీల్డింగ్ ఎఫర్ట్‌గా ఈ క్యాచ్ నిలిచిపోయింది. ఈ వీడియో చూసిన ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ‘క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్’, ‘కళ్లు చెదిరే క్యాచ్’, ‘వాట్ ఏ క్యాచ్’, ‘స్టన్నింగ్ క్యాచ్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ మ్యాచ్‌లో వెల్లింగ్టన్ ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెల్లింగ్టన్ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులు చేసింది. వాన్ బీక్ (41) టాప్ స్కోరర్. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సెంట్రల్ డిస్ట్రిక్ట్ 16.5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. జాక్ బాయిల్ (57) హాఫ్ సెంచరీ చేశాడు.
Don’t rub your eyes. It’s real!
.
.#SuperSmashOnFanCode pic.twitter.com/J5DRk1U3VA— FanCode (@FanCode) January 13, 2024