Site icon NTV Telugu

Khalistan: భారత సంతతి వ్యక్తి హత్యకు ఖలిస్తాన్ తీవ్రవాదుల కుట్ర.. ముగ్గురికి శిక్ష విధింపు..

New Zealand

New Zealand

Khalistan: ఇటీవల కాలంలో ఖలిస్తానీ వేర్పాటువాద నేతలు యాక్టీవ్ అవుతున్నారు. ముఖ్యంగా కెనడా, యూఎస్, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో వారి కార్యకలాపాలు పెరిగాయి. భారత వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. ఇదే కాకుండా ఖలిస్తానీ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని హతమర్చాడానికి ప్రయత్నించడంతో పాటు భయాందోళనకు గురిచేస్తున్నారు. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత అక్కడ హిందువులను టార్గెట్ చేసుకుంటూ గురుపత్వంత్ సింగ్ పన్నూ అనే ఖలిస్తాన్ ఉగ్రవాది బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఇదిలా ఉంటే ఖలిస్తాన్ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనే కోపంతో న్యూజిలాండ్ ఆక్లాండ్‌లో రేడియో హోస్ట్ హర్నెక్ సింగ్‌పై ముగ్గురు ఖలిస్తాన్ తీవ్రవాదులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ కేసులో ముగ్గురికి శిక్ష పడింది. 27 ఏళ్ల సర్వజీత్ సిద్దూ హత్యాయత్నానికి పాల్పడ్డాడని, 44 ఏళ్ల సుఖ్‌ప్రీత్ సింగ్ దీనికి సహకరించాడని, మూడో వ్యక్తి అక్లాండ్ నివాసి అని ది ఆస్ట్రేలియన్ టుడే నివేదించింది.

ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి మార్క్ వూల్‌ఫోర్డ్ సమాజ రక్షణ, మతపరమైన మతోన్మాదానికి వ్యతిరేకంగా బలమైన చర్యల అవసరాన్ని నొక్కి చెప్పారు. డిసెంబర్ 23,2020న హర్నెక్ సింగ్‌ను అతని ఇంటిబయట ఖలిస్తానీ తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. 40 కంటే ఎక్కువ సార్లు కత్తితో పొడిచారు. ఈ ఘటనలో 350 కంటే ఎక్కువ కట్లు పడటంతో పాటు అతనికి అనేక సర్జరీలు చేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

Read Also: Silk Smitha : వెండితెర పై సిల్క్ స్మిత అన్ టోల్డ్ స్టోరీ.. వైరల్ అవుతున్న ఫస్ట్ లుక్..

హర్నెక్ సింగ్‌ని హత్య చేయడానికి ఖలిస్తానీ భావజాలం ఉన్న వ్యక్తులు మూడు కార్ల నిండా వ్యక్తులు అతడిని అనుసరించారు. ప్రమాదాన్ని గమనించి కార్ డోర్లు మూసేసి, గట్టిగా కార్ హారన్ కొట్టడంతో ఇరుగుపొరుగు వారు ఈ దాడిని చూడగలిగారు. ప్రముఖ కివీస్ రేడియో హోస్ట్‌గా ఉన్న హార్నెక్ సింగ్ ఖలిస్తాన్‌కి వ్యతిరేకంగా గళం విప్పినందుకు ఈ దాడి జరిగింది.

ఈ దాడికి పాల్పడిన వ్యక్తుల్లో్ 48 ప్రధాన సూత్రధారికి 13.5 ఏళ్ల శిక్ష విధించబడింది. సర్వజీత్ సిద్దూకి 9.5 ఏళ్లు జైలు శిక్ష, సుఖ్‌ప్రీత్ సింగ్‌కి 6 నెలల గృహ నిర్భందం విధించబడింది. మరో ఇద్దరు వ్యక్తులు జగరాజ్ సింగ్, గుర్బిందర్ సింగ్‌కి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకపోవడంతో నిర్దోషులుగా విడుదలయ్యారు. మరో ఇద్దరు జోబన్ ప్రీత్ సింగ్, హర్దీప్ సింగ్‌కి ఈ హత్యయత్నంలో ప్రమేయం ఉండటంతో వచ్చే ఏడాది ప్రారంభంలో శిక్ష విధించబడనుంది.

Exit mobile version