NTV Telugu Site icon

New Year Celebrations : న్యూ ఇయర్ వేడుకలకు సిద్దమైన హైదరాబాద్

Frinking New Year

Frinking New Year

న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం సిద్దమైంది. సిటీ లో భారీగా ఈవెంట్స్ , పార్టీ లు చేసుకునేందుకు ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ వేడుకలను ఆస్వాదించడానికి యువత రెడీ అయ్యింది. రాత్రి 1 గంటల వరకే వేడుకలు చేయాలనీ పోలీసుల ఆదేశాలు జారీ చేశారు. తాగి మద్యం వాహనాలు నడిపిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసుల హెచ్చరించారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు హైదరాబాద్ లో అన్ని ఫ్లై ఓవర్లు మూసివేయనున్నట్లు తెలిపారు పోలీసులు. ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు పోలీసుల సూచించారు. పార్టీల్లో డ్రగ్స్ మాట వినపడితే కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు హైదరాబాద్ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు.

 

ఆదివారం రాత్రి 12:15 గంటల వరకు మెట్రో రైలు సేవలు నడుస్తాయని ఆయన వెల్లడించారు. చివరి మెట్రో రైళ్లు రాత్రి 12:15 గంటలకు బయలుదేరి ఒంటి గంటకు గమ్యస్థానాలకు చేరుతాయని వెల్లడించారు. ప్రతీ మెట్రో రైలు, మెట్రో స్టేషన్ లలో మెట్రో భద్రతా సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని ఆయన తెలిపారు.మెట్రో స్టేషన్ లోకి మద్యం సేవించి రావొద్దని హెచ్చరించారు. అలాంటి వారు ఎవరైనా వేస్తే ట్రైన్ ఎక్కేందుకు భద్రతా సిబ్బంది అనుమతించరని తెలియచేశారు. మెట్రో పరిధిలో ఎవరితో దుర్బాషలాడినా, ఎవరినైనా వేధించిన కఠిన చర్యలు తీసుకుంటామని మెట్రో ఎండీ ప్రయాణికులను హెచ్చరించారు. ప్రయాణికులు అంతా బాధ్యతగా వ్యవహరించి మెట్రో సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.