Site icon NTV Telugu

Vijay Rashmika : మరో సారి విజయ్ తో రొమాన్స్ చేయనున్న రష్మిక.. ఇది కదా కావాల్సింది

Vijay Rashmika Engagement

Vijay Rashmika Engagement

Vijay Rashmika : టాలీవుడ్ ట్రెండింగ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గీత గోవిందం సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. అప్పటి నుంచి వీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను వారిద్దరూ ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తున్నారు. అంతేకాదు.. ఎక్కడో ఒకచోట కలిసి కనిపించడం, రష్మిక పండగల సమయంలో విజయ్ దేవరకొండ ఇంట్లో ఉండడం, ఓకే ప్లేస్‌కి వెకేషన్‌కు వెళ్లడం..ఇవన్నీ వారు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చూపిస్తున్నాయి. వారిద్దరు స్క్రీన్ పై కనిపిస్తే ఓ అద్భుతంగా ఉంటుందని కోరుకునే అభిమానులు ఎందరో ఉన్నారు. అలాంటి వారి కోసం ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Read Also:Manipur Violence : మణిపూర్‌లో అదుపుతప్పిన పరిస్థితి.. రంగంలోకి అమిత్ షా

శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ ‘రాహుల్ సంకృత్యాన్’ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్ డేట్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఈ సాంగ్ ను రష్మిక మందన్నా చేత చేయిస్తే బాగుంటుందని తాజాగా చిత్ర యూనిట్ ఫీల్ అవుతున్నారట. మరి రష్మిక మందన్నా ఈ సాంగ్ చేయడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి. విజయ్ దేవరకొండతో రష్మిక మందన్నాకి మంచి స్నేహం ఉంది కాబట్టి కచ్చితంగా ఒప్పుకుంటుందని అంటున్నారు.

Read Also:APSRTC: ఆర్టీసీలో 1,275 డ్రైవర్లు, 789 కండక్టర్ల కొరత..

కానీ, ఆమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కాబట్టి స్పెషల్ సాంగ్ చేస్తోందా ? లేదా ? అనేది చూడాలి. కాగా ఈ మూవీ షూటింగ్ 2025 జనవరి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ‘రాహుల్ సంకృత్యాన్’ దర్శకత్వంలో న్యాచులర్ స్టార్ నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో, విజయ్ దేవరకొండ సినిమా పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Exit mobile version