NTV Telugu Site icon

AR CI Swarnalatha: సీఐ స్వర్ణలత విచారణలో ఆసక్తికర అంశాలు.. సినిమా స్టోరీలు చెబుతుందా..?

Ar Ci Swarnalatha

Ar Ci Swarnalatha

AR CI Swarnalatha: రూ.2 వేల నోట్ల కేసు విచారణలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలత చెబుతున్న విషయాలను చూసి నోరు వెల్లబెడుతున్నారు అధికారులు.. సీఐ స్వర్ణలత విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి.. ఇన్వెస్టిగేషన్ అధికారుల ముందు విచిత్రంగా ప్రవర్తించారు స్వర్ణలత.. మోసం చేయాలన్న కుట్రలో భాగంగానే కరెన్సీ ఎక్చేంజ్ డ్రామా ఆడగా.. స్వర్ణలత ముఠా ఆలోచనలు ముందే పసిగట్టిన రిటైర్డ్ నేవీ ఉద్యోగులు.. రూ.12 లక్షలు ఒక బ్యాగ్ లోను.. మిగిలిన నగదు డిక్కీలో స్టెఫీన్ టైర్ కింద ఉంచారని తేల్చారు.. అయితే, విచారణ సమయంలో సినిమా స్టోరీలు చెప్పి అధికారులను మభ్య పెట్టే ప్రయత్నం స్వర్ణలత చేస్తున్నారట.. కానీ, డిపార్ట్‌మెంట్‌లో పని చేశారు కనుక మర్యాదగా అడుగుతున్నాం.. నిజాలు చెప్పండని సీనియర్ ఆఫీసర్ క్లాస్‌ తీసుకున్నాడట.

Read Also: Amanchi Srinivasa Rao: జనసేనలోకి ఆమంచి సోదరుడు.. నేడు పవన్‌ సమక్షంలో చేరిక

అయితే, స్వర్ణలత అండ్ గ్యాంగ్ వెల్లడించిన సమాచారంతో షాక్ అయ్యారు విచారణ అధికారులు.. పెద్ద ఎత్తున నోట్లు మార్పిడికి సిద్ధంగా ఉన్నట్టు నమ్మించే ప్రయత్నం చేసిన గ్యాంగ్.. నేవీ ఉద్యోగులు 90 లక్షలు తెచ్చిన మాట నిజమే.. కానీ, కోటి రూపాయలు తాము తీసుకుని వెళ్ళలేదని వెల్లడించింది.. కాల్ డేటా ఆధారంగా నిందితులు ఇచ్చిన సమాచారం నిర్ధారించుకుంది విచారణ బృందం.. ఇక, రెండు వేల నోట్ల మార్పిడి పేరుతో దందాను విచారణ అధికారులు ఎదుట అంగీకరించింది ముఠా.. ఓ రాజకీయ నాయకుడు ప్రమేయంపై అనుమానం తలెత్తడంతో నివృత్తి చేసుకున్నారు పోలీసులు.. అయితే, సినిమాల మోజే కొంప ముంచిందని విచారణ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారట సీఐ స్వర్ణలత.. షూటింగ్ లోనే ఏ-1 సూరి పరిచయం అయినట్టు చెప్పిన రిజర్వ్డ్ ఇన్‌స్పెక్టర్.. ఏ1 సూరి, కానిస్టేబుల్, హోంగార్డు ఒత్తిడితోనే నేరానికి సిద్ధపడినట్టు తెలిపారట.. అంతా సూరిబాబే చేశాడు.. నా పాత్ర నామమాత్రమే అని చెప్పారట.. అసలు విషయం దాటవేస్తూ.. తన కెరీర్‌ పాడైపోయిందంటూ కన్నీరు పెట్టుకున్నారట స్వర్ణలత.. అయితే, సీజ్ చేసిన ఫోన్‌లోని డేటాతో తన వ్యక్తిగత జీవితం ముడిపడి ఉందని ఆమె ప్రాధేయపడ్డారట.. ఇక, డీసీపీ పర్యవేక్షణలో 24 గంటలు దర్యాప్తు కొనసాగింది.. స్వర్ణలత అభ్యర్ధనలు అధికారులు పట్టించుకోలేదు.. జాలిపడితే మా జీవితాలు కాలిపోతాయని కఠినంగా చెప్పారట ఉన్నతాధికారులు.