Site icon NTV Telugu

TSPSC : పేపర్ లీక్ లో ట్విస్ట్.. 46 మంది అమ్మాయిలతో న్యూడ్ వీడియో కాల్స్

Nude Calls In Tspsc

Nude Calls In Tspsc

TSPSC ప్రశ్నాపత్రం లీక్ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రధాన నిందితుడు ప్రవీణ్ విషయంలో రోజుకొక కొత్తకోణం వెలుగులోకి వస్తుంది. అమ్మాయిలతో ప్రవీణ్ న్యూడ్ వీడియోలు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 46 మంది మహిళలతో ప్రవీణ్ న్యూడ్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. వీళ్లకి కూడా పేపర్ లీక్ చేసిట్లుగా పోలీసులు గుర్తించారు.

Also Read : Air Hostess Archana: వీడిన ఎయిర్‌హోస్టెస్ మృతి మిస్టరీ.. అతడే చంపేశాడు

మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రవీణ్ తో పాటు రేణుక సెలవుల విషయంలోనూ ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. వనపర్తి మండలం బుద్దారం ఎస్సీ గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా రేణుక వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది 12 సెలవులు పెట్టినట్లు గుర్తించారు.. ఈ నెల 4,5 తేదీల్లో తమ బంధువు మృతి చెందాడని సెలవు పెట్టింది.. ఆ తేదీల్లోనే పేపర్ లీక్ జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రేణుక సర్టిఫికెట్ల విషయంలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి. టీఎస్పీఎస్సీ నిర్వహించిన ప్రతి పరీక్ష ముందు రేణుక సెలవులు పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Also Read : MLC Kavitha: మహిళా రిజర్వేషన్ కోసం ఒక్కో అడుగు ముందుకు వేద్దాం..

మరోవైపు పేపర్ లీక్ కు సూత్రధారిగా రాజశేఖర్ ను పోలీసులు తేల్చారు. ప్రవీణ్ ద్వారా పేపర్ ను బయటికి రాజశేఖర్ తెప్పించినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీలో సిస్టం అడ్మినిస్ట్రేటర్ గా రాజశేఖర్ వ్యవహరిస్తున్నాడు.. టెక్నికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటేషన్ పై వచ్చాడు. ప్రవీణ్, రాజశేఖర్ కలిసి పేపర్ ను బయటకు తెచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. సిస్టం పాస్వర్డ్ ఐడీ ఇచ్చినందుకు రాజశేఖర్ కు ప్రవీణ్ భారీగా డబ్బులు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.

Exit mobile version