NTV Telugu Site icon

Wrestlers: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ కేసులో ట్విస్ట్.. ఆ రెజర్ల్ మైనర్ కాదంటు వెల్లడి..

Brij Bhushan

Brij Bhushan

భారత రెజ్లర్ల సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీ లైంగికంగా వేధించినట్టు కేసు నమోదు చేసిన రెజ్లర్ మైనర్ కాదంటూ ఆమె తండ్రే స్వయంగా ఒప్పుకున్నాడు. దీంతో బ్రిజ్ భూషన్ పై నమోదైన కేసుల్లో పోక్సో చట్టం కింద ఎంపీపై నమోదైన కేసు నుండి ఆయనకు ఉపశమనం లభించే ఛాన్స్ ఉంది.

Also Read : Wrestlers protest: కీలకదశకు చేరుకున్న రెజ్లర్లు, ప్రభుత్వం మధ్య చర్చలు

గత కొంత కాలంగా భారత రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఏప్రిల్ 29న నమోదైన లైంగిక వేధింపుల కేసులో త్వరితగతిన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ నిరవధికంగా నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున రెజ్లర్లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో రెజ్లర్లు దీన్ని అవమానంగా భావించి తాము సాధించిన పతకాలను గంగానదిలో కలిపేయాలనుకోవడంతో.. రైతు సంఘం నాయకులు కల్పించుకుని రెజ్లర్లను వారించడం వంటి వరుస పరిణామాల మధ్య రెజ్లర్లు తమ నిర్ణయాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు.

Also Read : Fish Prasad: రేపు, ఎల్లుండి చేప మందు పంపిణీ.. మరో వారం రోజులు ఉండే ఛాన్స్

అనంతరం భారత రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో ఆరు గంటల పాటు చర్చించి విచారణపై రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో అప్పటికి సమస్య సద్దుమణిగింది. ఇంతలో ఎంపీ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణ చేసిన రెజ్లర్ సంఘటన జరిగే సమయానికి అసలు మైనరే కాదని స్వయంగా ఆమె తండ్రే వెల్లడించడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. కేసు నమోదు చేసిన టైంలో ఆమె ఇచ్చిన వాంగ్మూలంలో పుట్టుక వివరాల్లో తప్పులు దొర్లాయని ఆయన ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో బ్రిజ్ భూషణ్ పై పోక్సో చట్టం కింద నమోదైన కేసు నుంచి ఉపశమనం లభించే అవకాశముంది.