NTV Telugu Site icon

Swetha Death Case Mystery: శ్వేత కేసులో మరో ట్విస్ట్‌.. వెలుగులోకి సంచలన విషయం..!

Swetha Death Case

Swetha Death Case

Swetha Death Case Mystery: విశాఖపట్నం బీచ్‌లో మృతదేహమై తేలిన వివాహిత శ్వేత కేసులో మరో సంచలన అంశం వెలుగు చూసింది.. ఈ కేసులో శ్వేత కాల్ రికార్డింగ్స్, పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారాయి.. ఇప్పటికే శ్వేత తల్లి రమాదేవి స్టేట్‌మెంట్‌ను త్రీటౌన్‌ పోలీసులు నమోదు చేశారు. ఇంటి నుంచి బయలుదేరే గంట ముందు వరకు కూడా భర్త మణికంఠతో గొడవపడినట్లు విచారణలో తేలింది. మరోవైపు.. శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది.. ఇదే సమయంలో శ్వేత అనుమానాస్పద మృతి కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.. భర్త మణికంఠ చెల్లెలి భర్తపై లైంగిక వేధింపులు కేసు నమోదైంది.. శ్వేత తల్లి రమ దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు త్రీ టౌన్ పోలీసులు.. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ తో పాటు, శ్వేత సెల్‌ఫోన్‌ కీలకంగా మారగా.. మొబైల్ లాక్ ఓపెన్ చేస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.. ఇక, విశాఖలోని జ్ఞానాపురం స్మశాన వాటికలో శ్వేత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Read Also: Mallikarjun Kharge: ప్రధాని మోదీ “విషపు పాము”.. కాంగ్రెస్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

అయితే, అత్తింటి వేధింపులు తట్టుకోలేకే తన కూతురు చనిపోయిందని శ్వేత తల్లి రమాదేవి చెబుతున్నారు.. పెళ్లైన నెల రోజుల నుంచే కూతుర్ని వేధించడం ప్రారంభించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అల్లుడి అసలు గుణం అప్పుడే బయటపడిందని.. నెల రోజులు క్రితం కూడా విడాకులు ఇస్తామని శ్వేతను భర్త మణికంఠ బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు అయిదు నెలల గర్భిణీ అని కూడా కనికరించకుండా అత్తామామలు చిత్రహింసలు పెట్టేవారని కన్నీరుమన్నీరయ్యారు.. ఇంట్లో పనులన్నీ తనతోనే చేయించేవారని, అత్త మామలు చెప్పిన పనులు చేయాలంటూ ఫోన్‌లో భర్త కూడా ఆదేశాలిచ్చేవాడని చెప్పుకొచ్చారు..

Read Also: Delhi Liquor Case: మనీష్ సిసోడియాకు జ్యుడిషియల్ రిమాండ్ పొడగింపు..

భర్తను పోగొట్టుకున్న నేను.. కూతుర్ని ఒక్కదాన్నే కష్టపడి పెంచి పెద్ద చేశా.. అత్తమామలు ఇబ్బందులు పెడుతున్నారని రోజూ ఫోన్‌ చేసి ఏడ్చేదని శ్వేత తల్లి రమాదేవి తెలిపారు.. సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతానని చెప్పింది. పెళ్లైన తరవాత చదివించకుండా వంటింటికే పరిమితం చేశారన్నారు. కాగా, శ్వేత చనిపోయేముందు సూసైడ్‌ నోట్‌ రాసిన విషయం విదితమే.. ‘చిట్టీ.. నాకు ఎప్పుడో తెలుసు నేను లేకుండా నువ్వు బిందాస్‌గా ఉండగలవని. నీకు అసలు ఏమాత్రం ఫరక్ పడదు. ఎనీ వే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.. అండ్ న్యూ లైఫ్. చాలా మాట్లాడడానికి ఉన్నా కూడా నేను ఏం మాట్లాడటం లేదు. బికాజ్.. నువ్వు బయటకు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా యూ నో ఎవ్రీ థింగ్. జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఏ బిగ్ థాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్’ అంటూ రాసి ఉన్న లేఖను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సూసూడ్‌ నోట్‌ వ్యవహారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

ఇక, ఈ కేసుపై మీడియాతో మాట్లాడిన ఏసీపీ వివేకనందా.. శ్వేత తల్లి రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం అన్నారు. శ్వేత అడపడచు భర్త లైంగిక వేధింపులు భరించలేక శ్వేత ఆత్మహత్యకి పాల్పడినట్టు రమాదేవి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.. ఈ కేసులో నలుగురుని అదుపులోకి తీసుకున్నాం.. గృహహింస, లైంగిక వేధింపులు కింద 304 (B) ,354 (A) సెక్షన్లు కింద కేసు నమోదు చేశామన్నారు.. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు ఏసీపీ వివేకనందా.

Show comments