Road Accident: జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో జరిగిన ప్రమాదం కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రెండు సంవత్సరాల క్రితం రోడ్డు నెంబర్ 45లో జరిగిన కారు ప్రమాదంలో బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహీల్ కారు నడిపినట్లు గుర్తించారు. కానీ, అప్పుడు రాహీల్ డ్రైవర్ కారు నడిపినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, కేసును రీ ఓపెన్ చేసిన వెస్ట్ జోన్ పోలీసులు.. ఆ కారు ప్రమాదం కూడా షకీల్ కొడుకు రాహీల్ చేసినట్టు వారు గుర్తించారు.
Read Also: SS Rajamouli Family: డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఫ్యామిలీకి తృటిలో తప్పిన ప్రమాదం.. 28వ అంతస్థులో..!
ఇక, ఈ కారు ప్రమాదం జరిగిన మూడు రోజులకు రాహీల్ డ్రైవర్ ఆఫ్సాన్ లొంగిపోయినట్లు వెస్ట్ జోన్ పోలీసులు పేర్కొన్నారు. తానే కార్ నడిపినట్లు చెప్పడంతో అఫ్సాన్ పై కేస్ నమోదు చేసి రిమాండ్ కు అప్పటి పోలీసులు తరలించారు. కానీ, తాజాగా చేసిన దర్యాప్తులో ఆ రోజు కారు నడిపింది అఫ్సాన్ కాదు రాహీల్ అని పోలీసులు గుర్తించారు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.