Site icon NTV Telugu

Kiran Royal Issue: జనసేన నేత కిరణ్ రాయల్ వివాదంలో కొత్త కోణం..!

Kiran Royal

Kiran Royal

Kiran Royal Issue: తిరుపతి కిరణ్ రాయల్ అంశంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది.. ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో పలువురు జనసేన, వైసీపీ నేతలపై లక్ష్మీరెడ్డి ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా సంచలన నిజాలను బయటపెట్టింది. తన ఫొటో, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసారని వైసీపీ నేత సురేష్ పై ఆరోపణలు చేశారు. సురేష్ కు జనసేన నేతలు దినేష్ జైన్, గని, హరిశంకర్ సహకరించారని కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో ఉన్న మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయాలని లక్ష్మీ రెడ్డి కోరింది. ఫిర్యాదులో వైసీపీ నేత సురేష్ ఫొటో, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సురేష్‌కు జనసేన నేతలు దినేష్ జైన్, గని, హరి శంకర్ సహకారం అందించారు. సోషల్ మీడియాలో ఉన్న మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయాలని అనేకమార్లు కోరాను. టైం వచ్చినప్పుడు డిలీట్ చేస్తామని.. ఇప్పుడు సైలెంట్‌గా ఉండాలని జనసేన, వైసీపీ నేతలు ఒత్తిడి పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. సోషల్ మీడియాల్లో తనపై జరుగుతున్న విష ప్రచారానికి చెక్ పెట్టేందుకు ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Read Also: Bollywood : యావరేజ్ బ్యూటీకి వరుస ఆఫర్లు.. ఏమి చూసి ఇస్తున్నారో

మార్ఫింగ్ వీడియో, ఫొటోలను వైరల్ చేసిన వ్యక్తులపై కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది. ఇక, కిరణ్ రాయల్ పై గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు లక్ష్మీ రెడ్డి… కిరణ్ అవసరాలకు తన నుంచి తీసుకున్న రూ.1.20 కోట్లు రూపాయలు తీసుకుని ఇవ్వాలేదని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో చెప్పుకొచ్చారు‌‌.. అటు తరువాత కిరణ్ రాయల్‌తో వివాదాన్ని రాజీ చేసుకున్నట్లు ప్రకటించారు.. కిరణ్ రాయల్ తో ఆర్థిక లావాదేవీలు సర్దుబాటు చేసుకున్నాని తెలిపారు. తన కుటుంబ సమస్యల వల్లే బయటకు వచ్చాను.. కానీ, రాజకీయ పార్టీలు తనను వాడుకున్నాయని ఆరోపించారు. కిరణ్ రాయల్‌కు తనకు ఆర్థికపరమైన సంబంధాలే ఉన్నాయని వాటిని కూడా కిరణ్ రాయల్ తిరిగి ఇచ్చేసారని అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు లక్ష్మిరెడ్డి.. కానీ, నన్ను ముందు పెట్టి కిరణ్ రాయాల్‌ను టార్గెట్ చేస్తూ నా విషయాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేడర్ ట్రోల్స్ చేసుకున్నారన్నారు. తన సమస్యను వేరే వాళ్లు రాజకీయం కోసం వాడుకున్నారని, దీంతో తనకు సంబంధం లేదన్నారు. ఇప్పుడు మరోసారి తనను వైసీపీ, జనసేనలో కొందరు నేతలు మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది..

Exit mobile version