NTV Telugu Site icon

South Coastal Zone: విశాఖపట్నం కేంద్రంగా 410 కి.మీ పరిధితో కొత్త జోన్ ఏర్పాటు

Scr

Scr

South Coastal Zone: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద మైలురాయిగా మరో కొత్త రైల్వే జోన్ ఏర్పాటయ్యింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటును కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. ఈ నిర్ణయంతో విశాఖపట్నం రైల్వే డివిజన్‌ను కొత్తగా ఏర్పాటు చేయబోయే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో భాగం చేశారు. ప్రస్తుతం ఉన్న వాల్తేర్ రైల్వే డివిజన్‌ను విశాఖపట్నం రైల్వే డివిజన్‌గా మారుస్తారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు రైల్వే డివిజన్లు ఉండనున్నాయి. మరో కీలక నిర్ణయంగా, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న కొండపల్లి-మోటుమర్రి సెక్షన్‌ను విజయవాడ డివిజన్‌లో విలీనం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం విజయవాడ శివార్లలో ఉన్న కొండపల్లి ప్రాంతం సికింద్రాబాద్ డివిజన్‌లో భాగంగా ఉంది. ఇకపై ఈ సెక్షన్‌ను విజయవాడ డివిజన్‌లో భాగంగా పరిగణించనున్నారు.

Read Also: Mallikarjun Kharge: రాజ్యసభలో బీజేపీ ఎంపీపై ఖర్గే ఘాటు వ్యాఖ్యలు.. నోరు మూసుకుని కూర్చో అంటూ..

410 కి.మీ పరిధిలో దక్షిణ కోస్తా రైల్వే జోన్:
కొత్త దక్షిణ కోస్తా రైల్వే జోన్ మొత్తం 410 కి.మీ పరిధిలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది రైల్వే సేవలను మరింత సమర్ధంగా, పటిష్టంగా మారుస్తుంది. జోన్ ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న ఈ నిర్ణయాల ద్వారా, ప్రాంతీయ ప్రాభావాన్ని పెంచి, పాలనా సౌలభ్యాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కొత్త జోన్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే సేవలు మరింత మెరుగవుతాయని, ప్రాంతీయ ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మరింత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ ఏర్పడుతుందని అంచనా వేయబడుతుంది.