Site icon NTV Telugu

EPF: పీఎఫ్‌ చందాదారులకు శుభవార్త.. ఇకపై చికిత్స కోసం ఎంత తీసుకోవచ్చంటే..!

Epfo

Epfo

పీఎఫ్‌ చందాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త ఆర్థిక సంవత్సరం శుభవార్త చెప్పింది. ఇకపై పీఎఫ్‌ ఖాతాదారులు ఎవరిపై ఆధారపడకుండా వైద్య ఖర్చుల నిమిత్తం ఖాతా నుంచి లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఈపీఎఫ్‌ఖాతాలో జమ అవుతున్న మొత్తం పదవీ విరమణ కోసమే అయినా అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో చందాదారులు పాక్షికంగా లేదా పూర్తిగా విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పిస్తోంది. విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం ఇలా పలు సందర్భాల్లో ఈ ఫండ్‌ నుంచి కొంత మొత్తంలో నగదును ఉపసంహరించుకోవచ్చు. అయితే దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి. తాజాగా ఇందులో ఈపీఎఫ్‌వో కీలక మార్పు చేసింది. వైద్య ఖర్చుల కోసం చేసుకునే ఆటో క్లెయిమ్‌ పరిమితిని ఈపీఎఫ్‌ఓ రెట్టింపు చేసింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో సర్క్యులర్‌లో వెల్లడించింది. క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచుతున్నట్లు పేర్కొంది. చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబసభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం ఈపీఎఫ్‌ డబ్బులను విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది.

ఇది కూడా చదవండి: Russia-Ukraine War: ఉక్రెయిన్‌తో యుద్ధంలో 50,000 రష్యన్ సైనికులు మృతి

టీబీ, క్షయ, పక్షవాతం, క్యాన్సర్‌, హృద్రోగ చికిత్సల కోసమూ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఎలాంటి మెడికల్‌ సర్టిఫికెట్లు లేకుండానే సెల్ఫ్‌ డిక్లరేషన్‌ సమర్పించి దీన్ని పొందొచ్చు. 2024, ఏప్రిల్ 16 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వచ్చింది. ఉద్యోగి 6 నెలల బేసిక్, డీఏ లేదా వడ్డీతో సహా ఉద్యోగి వాటా ఏది తక్కువైతే అది విత్‌డ్రా చేయలేరు. అంటే ఈ మొత్తానికి మించి మీ PFలో రూ. 1 లక్ష ఎక్కువగా ఉంటే మాత్రమే దీనిని క్లెయిమ్ చేసుకోవచ్చు.లేదంటే కుదరదు.

ఇది కూడా చదవండి: TMC manifesto: సీఏఏ, ఎన్‌ఆర్సీ రద్దుతో పాటు 10 వాగ్దానాలు.. ఏవేవంటే..!

Exit mobile version